తల్లిదండ్రుల శ్రాద్ధం? ఇంట్లోనే నిర్వహించాలా?
లహరి, మార్చి 7, అద్యాత్మికం : తల్లిదండ్రుల పుణ్యతిథి ఇంట్లోనే చేయాలని నియమం ఏమీ లేదు. తల్లిదండ్రుల పుణ్యతిథి ఇంట్లోనే చేయాలని నియమం ఏమీ లేదు. నదీ తీరంలో కూడా చేయొచ్చు. నదీ తీరంలో చేయడం మరింత ప్రశస్తమని శాస్త్ర వచనం. అది ఏదైనా పుణ్యక్షేత్రం అయితే, మరింత విశేషమని పెద్దలు చెబుతారు.తీర్థమూ, క్షేత్రమూ కలిసినచోట ఆ నది పవిత్రత, ఆ క్షేత్రంలోని దేవుడి దీవెనలు కూడ పితృకార్యం సక్రమంగా సాగడానికి దోహదం చేస్తాయని అభిప్రాయం. శ్రద్ధతో నిర్వహించేది శ్రాద్ధం. జీవితాన్ని ప్రసాదించిన తల్లిదండ్రులకు కృతజ్ఞత తెలియజేసే పవిత్ర కార్యం ఇది. శ్రద్ధ, భక్తి, ఏకాగ్రత మరింత స్థిరం కావడానికి ఇంటి కన్నా నదీ తీరం ప్రశస్తమని గ్రహించాలి.