ఈ ఫోటోలు ఇంట్లో ఉంటే ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి..

ఈ ఫోటోలు ఇంట్లో ఉంటే ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి..

0
TMedia (Telugu News) :

ఈ ఫోటోలు ఇంట్లో ఉంటే ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి..

లహరి, జనవరి 22, ఆధ్యాత్మికం : మన భారత దేశ ప్రజలు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వాస్తు శాస్త్రాన్ని కచ్చితంగా పాటిస్తూ ఉంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం గుర్రం ఫోటో విజయం, శక్తి, పురోగతి, శాంతి, శ్రేయస్సుకు చిహ్నం. దానిని ఇంట్లో ఉంచడం వల్ల జీవితంలో ఇవన్నీ లభిస్తాయి అని చాలామంది ప్రజలు నమ్ముతారు. అంతే కాకుండా ఇంట్లో ఈ ఫోటో ఉంచడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తులు వస్తాయి. అంతే కాకుండా ఆ ఫోటోలో సూర్యుడు ఉంటే దానికి ఇంకా ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది అని వాస్తు శాస్త్రంలో ఉంది.

ఈ గుర్రాలు జీవితంలో ధైర్యం, బలం, శాంతిని కూడా పెంచుతాయి. ఈ పరుగు గుర్రాలు జీవితంలో ఎదుగుదలను వేగవంతం చేయడానికి సహాయపడతాయని చెబుతూ ఉంటారు. దీన్ని సరైనది దిశలో ఉంచడం వల్ల మీ జీవితంలో ఆర్థిక సమస్యలు దూరం అయిపోతాయి. మీ జీవితంలో ధన లాభం పెరుగుతుంది. ఈ ఏడు గుర్రాల ఫోటో మీ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని మీకు ఇస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం బెడ్ రూమ్ లోపల ఈ ఫోటోను ఉంచడం వల్ల నెగటివ్ ఎనర్జీ బయటకి వెళ్ళిపోతుంది. ఇంకా చెప్పాలంటే ఈ ఫోటోలను కొనుగోలు చేయడానికి ముందు ఈ ఫోటోలను సరిగ్గా చూడడం మంచిది. తెల్ల గుర్రాల ఫోటో తీసుకురావడం ఎంతో మంచిదిగా చాలా మంది ప్రజలు భావిస్తారు.

Also Read : మల్లన్న బ్రహ్మోత్సవాలు.. కొమురవెల్లికి పోటెత్తిన భక్తులు

ఇది మీకు అనేక విధాలుగా ప్రయోజనం అందేలా చేస్తుంది. అంతే కాకుండా ఏడు గుర్రాలు ఉండేలి విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోవడం మంచిది. ముఖ్యమైన విషయం చెప్పాలంటే ఈ ఏడు గుర్రపు ఫోటోలు మీ ఇంటి పడకగది బయట ఉంచవచ్చు. లోపల ఉంచడం మంచిది కాదు. ఆఫీసులో లేదా బాత్రూం దగ్గర ఈ ఫోటోలను అసలు పెట్టకూడదు. ఎర్ర గుర్రం ఫోటో ఎంత మంచిదో తెల్ల గుర్రం ఫోటో కూడా జీవితంలో ఎదగడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇలా చేయడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని చాలా మంది ప్రజలు నమ్ముతారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube