ఈ ఆలయాన్ని పైనుంచి కిందకు నిర్మించారు

-కైలాశ ఆలయ రహస్యం

0
TMedia (Telugu News) :

ఈ ఆలయాన్ని పైనుంచి కిందకు నిర్మించారు

-కైలాశ ఆలయ రహస్యం

లహరి, మార్చి 10, ఆధ్యాత్మికం : ఆ ఆలయ నిర్మాణానికి సిమెంట్, ఇటుకలు ఉపయోగించలేదు. అసలు ఏ నిర్మాణాన్ని అయినా భూమినుంచి మొదలుపెడతారు కానీ ఈ ఆలయ నిర్మాణం మాత్రం పైనుంచి కిందకు జరిగింది..అదెలా అంటారా..రాతినే కొండగా మలిచిన దైవసన్నిధి కైలాశ ఆలయం. మహారాష్ట్ర ఔరంగబాద్‌కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్లోరా గుహల్లోని కేవ్ 16‌లో ఈ ఆలయం ఉంది. దీని నిర్మాణానికి రాళ్లు, సిమెంట్ ఏవీ ఉపయోగించకుండా కేవలం రాతి కొండను ఆలయంగా మలచడం దీని ప్రత్యేకత అయితే పైనుంచి కిందకు చెక్కుకుంటూ వెళ్లడం మరో అద్భుతం. ఇంతకీ ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు. ఎందుకు నిర్మించారనేదానిపై విభిన్న కథలు ప్రచారంలో ఉన్నాయి.
18 ఏళ్ల పాటూ చెక్కిన ఆలయం
ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేని సమయంలో దాదాపు 100 అడుగుల ఎత్తైన కొండను ఆలయంగా చెక్కారు. పురావస్తు పరిశోధకుల అంచనాల ప్రకారం 4 లక్షల టన్నుల రాయిని 18 ఏళ్లపాటు చెక్కి ఈ ఆలయాన్ని నిర్మించారని గుర్తించారు. శాసనాల ప్రకారం ఈ ఆలయాన్ని క్రీ.శ.783లో పూర్తిచేసినట్లు ఉంది.

Also Read : ఒడిబియ్యం వేడుక మాత్రమే కాదు ప్రతి గింజలోనూ పుట్టింటి భరోసా

కూల్చడం అసాధ్యం
ఈ ఆలయాన్ని నాశనం చేసేందుకు ఔరంగ జేబు తన సైన్యాన్ని పంపాడని, వారంతా మూడేళ్లు కష్టపడినా కేవలం 5 శాతం మాత్రమే నాశనం చేయగలిగారని చెబుతుంటారు. ఇప్పటికీ ఆ ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తాయి. ఆలయ గోడలపై రామాయణం, భాగవతం, మహాభారత గాథలను శిల్పాలుగా మలిచారు. ఆలయ ఆవరణలోని స్తంభాలపై చెక్కిన శిల్పాలు ఆకట్టుకుంటాయి.

మిస్టరీ ఏంటంటే
ఈ ఆలయ నిర్మాణమే పెద్ద మిస్టరీగా భావించారు..కానీ మరో ముఖ్యమైన మిస్టరీ ఉంది. ఈ మొత్తం నిర్మాణాన్ని పరిశీలిస్తే.. దీన్ని నిర్మించడం మనుషుల వల్ల కాదంటున్నారు. ఎందుకంటే ఆలయంలో చెక్కిన రెండు అడుగుల సొరంగంలోకి మనిషి వెళ్లడం అసాధ్యం అనిపిస్తుంది. అలాగే ఆలయం దిగువన గుండ్రని రంథ్రాలు కూడా చాలా లోతుగా ఉన్నాయి. ఇదంతా గమనిస్తే …ఈ ఆలయం కింద ఓ పట్టణం ఉందంటున్నారు. ఈ చిన్న గుహ నుంచి కిందికి వెళ్లాలంటే అతి చిన్న మనుషులు లేదా పిల్లల వల్లే సాధ్యం. అంటే వేలఏళ్ల క్రిందట ఏలియన్స్ ఇక్కడ సంచరించాయా..ఈ నిర్మాణాన్ని అవే చేశాయా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఆలయం మీద ఉన్న కొన్ని శిల్పాల్లో చిన్న చిన్న ఆకారాల్లో ఉన్న రూపాలను చూస్తే అది నిజమే అనిపిస్తుంది.

Also Read : పాలిచ్చే తల్లులకు పైనాపిల్‌ వల్ల ప్రయోజనాలెన్నో!

సొరంగాల్లో నిధులున్నాయా
ఆలయంలో ఉన్న శివలింగంపై పోసే నీళ్లు ఎక్కడికి వెళ్తాయో తెలియదు. అవి ఆ కింద ఉన్న అండర్ గ్రౌండ్ సిటీలోకి వెళ్తాయనే సందేహాలు ఉన్నాయి. ఆలయం నేలకు ఉన్న రంథ్రాలు గాలి, వెలుతురు కోసం ఏర్పాటు చేసినవి కావొచ్చని కొందరంటారు. అయితే ఆ రంధ్రాల్లో చిన్నపిల్లలు పడిపోయే ప్రమాదం ఉందని ప్రభుత్వం వాటిని మూసివేయించింది. 40 ఏళ్లుగా ఆ సొరంగాలు మూసే ఉన్నాయి. దీంతో ఆ గుహల్లో విలువైన నిధులు ఉండొచ్చనే సందేహాలు కూడా ఉన్నాయి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube