ఈ సమయాల్లోనే బంగారం కొనండి

అప్పుడే అర్థిక ప్రయోజనాలు.. ఎందుకంటే..?

0
TMedia (Telugu News) :

     ఈ సమయాల్లోనే బంగారం కొనండి

– అప్పుడే అర్థిక ప్రయోజనాలు.. ఎందుకంటే..?

టీ మీడియా, ఏప్రిల్ 20, ఆధ్యాత్మికం : అక్షయ తృతీయను ప్రతి ఏటా వైశాఖ మాస శుక్ల పక్షం మూడవ రోజున జరుపుకుంటారు. సంస్కృత భాషలో అక్షయ అంటే ‘శాశ్వతమైన లేదా అంతులేని ఆనందం, విజయం’ అని అర్థం. ఇక అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేస్తే అనేక రకాలుగా అర్థిక ప్రయోజనాలు కలుగుతాయని హిందువుల నమ్మకం. ఇలా చేస్తే ఐశ్వర్యం లభించడమే కాకలాభాలు కూడా కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయట. అయితే అక్షయ తృతీయ రోజున ఏ సమయంలో బంగారాన్నికొనుగోలు చేయాలో ఇప్పుడు చూద్దాం..

అక్షయ తృతీయ తిథి, శుభ గడియలు:
వైశాఖ మాసం శుక్ల పక్షం తృతీయ తిథి: ఈ ఏడాదిలో అక్షయ తృతీయ ఏప్రిల్ 22న ఉదయం 07:49 గంటలకు ప్రారంభమై.. ఏప్రిల్ 23 ఉదయం 07:47 గంటలకు ముగుస్తుంది.

అక్షయ తృతీయ పూజ ముహూర్తం:
అక్షయ తృతీయ రోజున అంటే ఏప్రిల్ 22 ఉదయం 07:49 నుంచి మధ్యాహ్నం 12:20 వరకు శుభ సమయం. మొత్తం పూజ వ్యవధి కాలం 04 గంటలు 31 నిమిషాలు.

బంగారం కొనడానికి శుభ సమయం:
అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనుగోలు చేయడం మంచిది. అయితే ఏప్రిల్ 22న ఉదయం 07:49 గంటలకు, అలాగే ఏప్రిల్ 23న ఉదయం 07:47 గంటలకు బంగారాన్ని కొనుగోలు చేయడం మంచిది.

 

AlsoRead:అవినాష్ ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్ విచార‌ణ వాయిదా

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube