క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్

క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్

0
TMedia (Telugu News) :

క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్

 

లహరి, ఏప్రిల్ 20, ఆధ్యాత్మికం :

ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యమున్న రంజాన్‌ మాసం ప్రత్యేక ప్రార్థనలు, కఠిన ‘రోజా’ ఉపవాస దీక్షలు, దానధర్మాలు, ఆధ్యాత్మిక సందేశాలతో సాగుతుంది. మహ్మద్‌ ప్రవక్త లా ఇల్లాహ ఇల్లాల్ల అనే సూత్రం ప్రకారం మానవులను కష్టాల నుంచి కాపాడేందుకు ఈ మాసాన్ని సృష్టించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ మాసంలో నెల రోజుల పాటూ ఉపవాస దీక్షలు చేస్తారు. ఈ దీక్షలతో శరీరం, మనసులోని మలినాలు ప్రక్షాళన కావడంతో పాటు సర్వపాపాలు దహించుకుపోతాయని విశ్వసిస్తారు. సూర్యోదయ సమయంలో ‘సహర్‌’ నుంచి సూర్యాస్తమయం సమయంలో జరిపే ‘ఇప్తార్‌’ వరకు మంచి నీళ్లు కూడా ముట్టుకోకుండా కటిక, కఠిన ఉపవాసం చేస్తారు. ఈ నెలలో చనిపోతే నేరుగా స్వర్గానికి చేరుతారని ముస్లింల ప్రగాఢ నమ్మకం.

ఉపవాస దీక్షలు :
రంజాన్ మాసంలో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు నీరు, ఆహారం, కనీసం ఉమ్మి కూడా మింగ కుండా కఠోర ఉపవాస దీక్ష చేపడతారు. వయస్సులో తారతమ్యం లేకుండా చిన్న, పెద్ద, ముసలి వారు సైతం భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలో ఉంటారు. ఉపవాస దీక్షలతో బలహీనతలను, వ్యసనాలను జయించవచ్చని ఇస్లాం మత గురువులు చెబుతారు. ఉపవాస దీక్షలు సహారీతో ప్రారంభమై ఇఫ్తార్‌తో ముగుస్తుంది. ఖర్జూరపు పండు తిని దీక్ష విరమించిన తర్వాత పలురకాలైన వంటకాలు భుజిస్తారు.ఈ వంటకాల్లో ప్రత్యేకమైనది హలీమ్.

సుర్మా :
‘సుర్మా’తో కళ్లకు కొత్త అందం వస్తుంది. కళ్లకు ‘సుర్మా’ పెట్టుకోవడం కూడా ముస్లింలు సున్నత్‌ గానే భావిస్తారు. ప్రవక్త హజరత్‌ మహ్మద్‌ సదా సుర్మా పెట్టుకునేవారని అంటారు. పౌడర్‌ రూపంలో ఉండే సుర్మాను ముస్లింలు భరిణెల్లో దాచుకొని ఇంటికి వచ్చిన అతిథులకు అత్తరుతో పాటు కళ్లకు పెట్టు కోవడానికి కూడా ఇవ్వడం సంప్రదాయం. నమాజు చేసేముందు ముఖం, కాళ్ళు, చేతులు శుభ్రం చేసుకుని సుర్మా పెట్టుకుంటారు… ఇది కేవసం సంప్రదాయం మాత్రమే కాదు కళ్లకు ఆరోగ్యం

 

AlsoRead:నేడే సూర్యగ్రహణం ఆ 7రాశుల వారు ఈ పనులు అస్సలు చేయకూడదు

 

నమాజ్ విశిష్టత :
సాధారణంగా ప్రతి శుక్రవారం ముస్లింలు నమాజ్‌ చేస్తుంటారు. ఇక రంజాన్‌ మాసంలో మత పెద్దలతో నమాజ్‌ చేయించడం ప్రశస్తమైనది. మసీద్ కు వెళ్ళలేనివారు తాము ఉన్న స్థలాన్ని శుభ్రం చేసుకుని ప్రార్థన చేస్తారు. రంజాన్‌ ఆఖరు పది రోజులు ఇళ్లలో కన్నా ఎక్కువ సమయం మసీదులో ఉంటారు. రంజాన్‌ పండుగను ఈదుర్‌ ఫితర్‌ అని అంటారు. నెలవంక దర్శనం ఇచ్చిన తర్వాత రోజు రంజాన్ సెలబ్రేట్ చేసుకుంటారు. అలయ్ బలయ్
నమాజ్ తర్వాత పిల్లలు, పెద్దలు అంతా ఒకరిపైమరొకరు స్నేహభావంతో ‘అలయ్ బలయ్ ‘ అంటే ఆలింగనం చేసుకుని పండగ శుభాకాంక్షలు చెప్పుకుంటారు. పండుగ రోజు షీర్‌ ఖుర్మా అనే మధురమైన వంటను అందరికీ రుచిచూపిస్తారు. దీంతో వీరి నెలరోజుల దీక్ష పూర్తవుతుంది.

దానధర్మాల వెనుకున్న ఆంతర్యం :
ఖురాన్ సిద్దాంతం ప్రకారం తాము సంపాదించిన దానిలో పేదవారికోసం ఎంతోకొంత దానం చేయాలన్నది భావిస్తారు. పండ్లు, గోధుమలు, సేమియా, బట్టలు, బంగారం దానం చేయాలని ఖురాన్‌ చెబుతోంది. ఈ దానాల వల్ల నిరుపేదలు కూడా పండుగరోజు సంతోషంగా ఉండాలన్నదే ఆంతర్యం. ఆకలి ఎంత కఠినంగా ఉంటుందో స్వయంగా అనుభవిస్తే తప్ప అనుభవంలోకి రాదు అనే భావనతో ఈ రంజాన్ ‘రోజా’ ఉపవాసదీక్షలు అనే సూత్రాన్ని ప్రతిపాదించారు. లోకంలో ఎంతో మంది అభాగ్యులు, నిరుపేదలు ఆకలితో అలమటిస్తూ దుర్భరమైన జీవితాలను గడుపుతున్నారో వారిపై మానవత్వం చూపాలన్నదే ఉపావసదీక్షల వెనుకున్న ఆంతర్యం.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube