శివయ్య కలలో ఇలా కనిపిస్తే శత్రువుల పీడ తొలగిపోతుందట…!

శివయ్య కలలో ఇలా కనిపిస్తే శత్రువుల పీడ తొలగిపోతుందట...!

0
TMedia (Telugu News) :

శివయ్య కలలో ఇలా కనిపిస్తే శత్రువుల పీడ తొలగిపోతుందట…!

లహరి, ఫిబ్రవరి 4, ఆధ్యాత్మికం : హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం మాఘ మాసంలోని క్రిష్ణ పక్షంలోని త్రయోదశి, చతుర్దశి తిథుల సమయంలో మహా శివరాత్రి పండుగ వస్తుంది. ఈ నేపథ్యంలో 2023 సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో 18వ తేదీన అంటే శనివారం నాడు ఈ మహా శివరాత్రి పండుగ వచ్చింది. ఈ పవిత్రమైన రోజున శివయ్య అనుగ్రహం కోసం భక్తులందరూ ప్రత్యేక పూజలతో పాటు కఠిన ఉపవాస దీక్షను కొనసాగిస్తారు. అలాగే జాగరణ చేస్తారు. ఇలా చేయడం వల్ల పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. మహా శివరాత్రికి ముందు మీరు ఎప్పుడైనా కలలో శివుడిని చూశారా? లేదా శివుని ఆయుధమైన త్రిశూలం, శివలింగం, పార్వతీ పరమేశ్వరులను, శివాలయాలను కలలో చూశారా? ఉదాహరణకు కొందరికేమో మెడలో సర్పంతో ఉండే శివుడు కనిపిస్తూ ఉంటాడు. మరికొందరికి తాండవమాడే శివుడు కలలో కనిపిస్తుంటారు. ఇంకా కొందరికి పార్వతీ పరమేశ్వరులు కనిపిస్తూ ఉంటారు. మహాశివరాత్రికి ముందు శివయ్యకు సంబంధించిన ఈ సంకేతాలు కలలో కనిపిస్తే స్వామి వారి ఆశీస్సులు లభించినట్టేనని పండితులు చెబుతున్నారు. ఈ సందర్భంగా కలలో ఏ రకమైన శివుడిని చూస్తే శుభ ఫలితాలొస్తాయి.. వాటి అర్థాలేంటి.. అలా కనిపిస్తే కోరీకలన్నీ నెరవేరుతాయా లేదా అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

కలలో శివాలయం కనిపిస్తే..
మీకు మహా శివరాత్రికి ముందు కలలో శివాలయం కనిపిస్తే లేదా మీరు పరమేశ్వరుని ఆలయానికి వెళ్తున్నట్లు కనిపిస్తే శుభ ఫలితాలొస్తాయని అర్థం చేసుకోండి. మీరు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలు లేదా వ్యాధుల నుంచి త్వరలో ఉపశమనం పొందుతారని అర్థం.
శివ తాండవం చేస్తున్నట్లు కనిపిస్తే..
శివ తాండవం చేస్తున్నట్లు కనిపిస్తే..

స్వప్నశాస్త్రం ప్రకారం, మీకు కలలో ఈశ్వరుడు తాండవం చేస్తున్నట్లు కనిపిస్తే, మీపై పరమేశ్వరుడు ఆగ్రహంతో ఉన్నారని లేదా మీకు జీవితంలో భవిష్యత్తులో అనేక కష్టాలు ఎదురుకానున్నాయని మాత్రం భయపడాల్సిన పని లేదు. మీకు నిజ జీవితంలో శత్రువులు బాధ ఎక్కువైనప్పుడు ఇలాంటి శివుని రూపాన్ని చూస్తారు. అంటే శివయ్య తన భక్తులకు శత్రువుల నుంచి త్వరలోనే విముక్తి ప్రసాదిస్తాడని అర్థం.
పార్వతీ పరమేశ్వరులను చూస్తే..
పార్వతీ పరమేశ్వరులను చూస్తే..
మీకు కలలో పార్వతీ పరమేశ్వరులు కనిపిస్తే, మీకు అర్థనాధీశ్వరుల ప్రత్యేక ఆశీస్సులు లభిస్తాయని అర్థం. మీ వైవాహిక జీవితంలో ఉండే అసమ్మతికి, మనస్పర్దలకు ముగింపు పలకబోతున్నారని అర్థం. అయితే ఇలాంటి కల వచ్చినప్పుడు మీరు పార్వతీ పరమేశ్వరులకు జలాభిషేకం చేస్తే శుభ ఫలితాలొస్తాయి. ఆ తర్వాత శివాలయంలో తేనే సమర్పించి సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం ప్రార్థించాలి.

Also Read : ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల కలిగే దుష్ర్పభావాలు ఏమిటి..?

మెడలో పాము, చేతిలో త్రిశూలంతో..
మెడలో పాము, చేతిలో త్రిశూలంతో..

స్వప్న శాస్త్రం ప్రకారం, పాము, త్రిశూలంతో ఉండే పరమేశ్వరుడు మీకు కలలో కనిపిస్తే, మీరు ప్రత్యేక ప్రయోజనాలు పొందనున్నారని అర్థం. మీకు త్వరలో ధనలాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. త్రిశూలంతో ఉండే శివుడు కనిపిస్తే మీ కష్టాలన్నీ త్వరలో ముగియబోతున్నాయని అర్థం. త్రిశూలం జీవితంలోని ప్రతి సంక్షోభాన్ని అధిగమించేందుకు, అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు ధైర్యాన్ని ఇస్తుందని నమ్ముతారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube