నుదిటి మీద బొట్టు.. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత

బొట్టులో ఎన్ని రకాలో తెలుసా..

0
TMedia (Telugu News) :

నుదిటి మీద బొట్టు.. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత

– బొట్టులో ఎన్ని రకాలో తెలుసా..

లహరి, ఫిబ్రవరి 14, ఆధ్యాత్మికం : ప్రపంచంలో భారతీయ వనితను విభిన్నంగా చూపించేది కట్టుబొట్టు.. ముఖ్యంగా హిందూ సాంప్రదాయంలో నుదుటిన పెట్టుకునే కుంకుమను అత్యంత ప్రాధాన్యత ఉంది. స్త్రీ ఐదో తనానికి గుర్తుగా భావిస్తారు. నుదిటిన కుంకుమ ధరించే స్త్రీ చూపరుల నుంచి గౌరవాన్ని ఇస్తుంది. ఇలా కుంకుమని ధరించడంలో కూడా శాస్త్రీయ కోణం ఉందని తెలుస్తోంది. హిందూ సంస్కృతీ సాంప్రదాయాలతో పెనవేసుకున్న కుంకుమ గురించి కొన్ని సంగతులు తెలుసుకుందాం..

నుదుటిన ధరించే బొట్టు.. ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అలంకరించుకునే కుంకుమలో రకాలున్నాయి. కుంకుమ, చందనం, విభూది, తిలకం వంటివి అనేక రకాలున్నాయి. పూర్వకాలంలో రాణులు తమ భర్తలు యుద్ధానికి వెళ్లే ముందు వారి నుదుటిపై కుంకుమని దిద్ది హారతులిచ్చేవారు. యుద్ధంలో గెలవడానికి వారిలో కొత్త శక్తిని, ఉత్సాహాన్ని నింపేవారు.
బొట్టులో రకాలు: భస్మం, విభూతిరేఖలు, కుంకుమ, గంధం వంటి వాటిని నుదుట బొట్టుగా ధారణ చేస్తారు.

తిలకం ప్రాముఖ్యత: నుదురు ముఖం కేంద్ర బిందువు. ఇది ఒక వ్యక్తిలో అంతర్ దృష్టి , ఆధ్యాత్మికత ప్రాంతాన్ని శాసిస్తుంది. రెండు కనుబొమ్మల మధ్య ఉండే ప్రదేశాన్ని ఆజ్ఞా చక్రం లేదా మూడో నేత్రం అని కూడా అంటారు. ఈ నేత్రం ద్వారానే మనుషులు భగవంతుని దర్శించగలరని హిందువుల విశ్వాసం. అందుకు ప్రతీకగా ఇక్కడ కుంకుమ ధరిస్తారు.ఇక్కడే అన్ని నాడుల కేంద్రం ఉంటుందని భారతీయ సంస్కృతి లో గురువుల నమ్మకం. ఈ కనుబొమ్మల మధ్యలో వేలితో బొట్టు పెట్టుకునేప్పుడు నొక్కడం ద్వారా శరీరంలో అన్ని నాడులు చైతన్యవంతం అవుతాయి. గంధపు తిలకాన్ని నుదుటిపై ధరించడం వలన పాపాలు తొలగిపోతాయని, జీవితంలో అన్ని అడ్డంకుల నుండి రక్షణ లభిస్తాయని.. లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం. తిలకం ధరించడం వలన పాపాలు తొలగిపోతాయని వివాహిత స్త్రీ తన భర్తకి దీర్ఘాయువు నిస్తుందని విశ్వాసం.

నుదిటిమీద పెట్టుకునే బొట్టు చెడు దృష్టి నుంచి రక్షిస్తుందని విశ్వాసం. ప్రతికూల శక్తులను దూరంగా ఉంచుతుంది. ఇది గ్రహ ప్రభావాలను శాంతపరుస్తుంది. అంతర దృష్టి శక్తిని పెంచుతుంది. కొన్నిసార్లు.. కొందరు తమ మెడ దగ్గర తిలకం ధరిస్తారు. ఇలా చేయడం వలన భావ వ్యక్తీకరణ శక్తిని మెరుగుపరుస్తుంది.

Also Read : ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సి సెల్ ఉపాధ్యక్షుని నియామకం

కుంకుమ దేనితో తయారు చేయబడుతుందంటే?

పూజ చేసే సమయంలో కుంకుమ ధరిస్తారు. దేవుడికి పసుపు, కుంకుమతో పూజలను చేస్తారు. పసుపు ఆరోగ్యాన్ని, ప్రకాశాన్ని అందిస్తుంది. ప్రతికూల శక్తులను దూరం చేస్తుంది. కుంకుమ పొడిని పసుపు.. సున్నంతో తయారు చేస్తారు. కుంకుమ ధరించిన వారిపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. అయితే ప్రస్తుతం కుంకుమను రసాయనాలతో తయారు చేస్తున్నారు. చాలామంది ప్లాస్టిక్ బిందీలను ఉపయోగిస్తున్నారు. ప్లాస్టిక్‌ స్టిక్కర్స్ ను నుదిటమీద ధరించడం మంచిది కాదు. విభూతి లేదా కుంకుమ లేదా పసుపు ధరించడం వలన ఆత్మపై ప్రభావం చూపుతుంది. దేవాలయాల్లో తీవ్రమైన ప్రాణిక ప్రకంపనలు ఉంటాయి. వాటిని మనం స్వీకరించలేము. కనుకనే ఆలయాల్లో విభూతి, కుంకుమ ఇస్తారు. ఇవి ఆలయ వాతావరణం నుండి శక్తిని గ్రహించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.. తద్వారా మీరు దానిని గ్రహించవచ్చు.

త్రిపుండ్రాలు

త్రిపుండ్రాలు హిందూమతంలో శైవులు నుదుటన అలంకరించుకునే విభూది. ఇది వాస్తవానికి విభూది .. బూడిద, గంధం, కుంకుమ, మట్టి లేదా పసుపుతో తయారు చేయబడింది. విభూదిని నుదిటిపై మాత్రమే కాదు.. కొందరు వంశాచారం ప్రకారం శరీరంలోని వివిధ భాగాలపై కూడా ధరిస్తారు. కుంకుమ ధరించే విధానంలో అనేక రకాలున్నాయి.

శైవులు విభూదిని మూడు సమాంతర రేఖలుగా ధరిస్తారు. పవిత్రమైన తెల్లటి బూడిద. విభూతిని ఆవు పిడకలు కాల్చి తయారు చేస్తారు. దీనిని త్రిపుండ్ర అని పిలుస్తారు. త్రిపుండ్ర మధ్యలో.. కుంకుమాన్ని ధరిస్తారు. వైష్ణవులు (విష్ణువును ఆరాధించేవారు) సాధారణంగా గంధం, లేదా మట్టి లేదా రెండింటి మిశ్రమాన్ని ఉపయోగించి తిలకం ధరిస్తారు. రెండు నిలువు నామాలను ధరిస్తారు. అవి ముక్కు నుంచి నుదిటి వరకూ వెళ్లేలా U లేదా Y ఆకారంలో తిలకం ధరిస్తారు. వీటిని ఉర్ధ్వ పుండ్రా అని పిలుస్తారు.

Also Read : కాంగ్రెస్ పార్టీ ఓబిసి సెల్ మండల అధ్యక్షుడు నియామకం

దేవిని ఆరాధించేవారు శక్తి ఆరాధనన సూచించే విధంగా కుంకుమని ఒకే ఎర్రటి నిలువు గీతను లేదా నామాన్ని లేదా ఎరుపు చుక్కను ధరిస్తారు. ఎవరైనా తిలకం ధరించవచ్చు.

తిలకం ఎప్పుడు ధరిస్తారంటే..

ఎవరైనా తిలకం ధరించే సమయంలో గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మీరు దానిని ధరించినప్పుడు కనీస నియమాలను పాటించాలి. తిలకం ధరించడానికి సమయ పరిమితి లేదు. స్నానం చేసిన తర్వాత.. కుంకుమ ధరించడానికి ఉత్తమ సమయం. ఆలయాన్ని సందర్శించినప్పుడు లేదా సాంప్రదాయ కార్యక్రమాల సమయంలో, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరైనప్పుడు.. లేదా అతిథులను ఆహ్వానించే సమయంలో కుంకుమను ధరించాల్సి ఉంటుంది. కొన్ని సంస్కృతులలో.. ప్రజలు చనిపోయిన వ్యక్తి లేదా చనిపోబోతున్న వ్యక్తుల నుదిటిపై తిలకం దిద్దుతారు. ఇలా చేయడం వలన వారి చివరి జీవితం సాఫీగా సాగుతుందని విశ్వాసం.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube