క్రీడలు మానసిక ఉల్లాసాన్నిస్తాయి

- టోర్నమెంట్ ను ప్రారంభించిన విప్ రేగా

0
TMedia (Telugu News) :

క్రీడలు మానసిక ఉల్లాసాన్నిస్తాయి

– టోర్నమెంట్ ను ప్రారంభించిన విప్ రేగా

టీ మీడియా,జనవరి 20,చర్ల : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గం లోని చర్ల మండల కేంద్రంలోని ఘడింకోట మైదానంలో అంతర్ రాష్ట్రస్థాయి మెగా క్రికెట్ టోర్నమెంట్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ , పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు, తొలిత క్రీడాకారులను పరిచయం చేసుకొని బ్యాటింగ్ చేసి క్రీడాకారులలో ఉత్సాహం నింపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
క్రీడలు మానసిక ఉల్లాసానికి శరీర దారుడ్యానికి దోహదపడుతున్నాయన్నారు, నేటితరం యువత విద్యతోపాటు క్రీడా రంగాలలో రాణిస్తూ ఉన్నత శిఖరాలను అవరోధించాలని, తల్లిదండ్రులకు ఉన్న ఊరికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు.

Also Read : అగ్నిప్రమాద ఘటనకు షార్ట్‌ సర్య్కూట్‌ కారణం కాదు

గౌరవ కేసీఆర్ గారు సీఎం అయిన తర్వాత క్రీడ రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నాడు కావున అన్ని విధాలుగా ప్రోత్సాహాలు సహాయ సహకారాలు అందిస్తున్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వమని అన్నారు, ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేసిందని అన్నారు, రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు సదుపాయాలు కల్పించి వారి నైపుణ్య ప్రదర్శించే అవకాశం కల్పిస్తుంది అన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube