
విజేతలకు బహుమతులను అందజేసిన ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
టీ మీడియా,జనవరి 16,కరకగూడెం:కరకగూడెం మండలంలోని తాటిగూడెం ఆదివాసీ యువసేన ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ పర్వదిన సందర్భంగా భద్రాద్రికొత్తగూడెం,ములుగు రెండు జిల్లాల స్థాయి వాలీబాల్ పోటీలు శనివారం సాయంత్రం ముగిశాయి.ఈ ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పాల్గొని క్రీడాకారులను పరిచయం చేసుకొని,విజేతలకు బహుమతులను అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విద్యార్థి దశ నుంచే ఆటల పట్ల ఆసక్తిని పెంపొందించుకొని, నైపుణ్యంతో క్రీడల్లో రాణించాలన్నారు.క్రీడల ద్వారా శారీరక ధృఢత్వంతో పాటు, మాన సికోల్లాసం వృద్ధి చెందుతుందన్నారు.అదే విధంగా గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని కోరారు. గెలవలేనన్న ఆశ లేనివాడు ఆటకు ముందే ఒడిపోతాడని, ప్రతి క్రీడాకారుడు పట్టుదలతో ఆడాలని సూచించారు.
ఈ వాలీబాల్ క్రీడలో మొదటి బహుమతిని ములుగు జిల్లా మంగపేట మండలంలోని నిమ్మగూడెం 15016/- , రెండోవ బహుమతిని కరకగూడెం మండలంలోని అనంతరం 10016/- , మూడోవ బహుమతిని పినపాక మండలంలోని పోట్లపల్లి 5016/-, నాల్గొవ బహుమతిని కరకగూడెం మండలంలోని తాటిగూడెం 3016/- గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు.ప్రతి ఏటా సంక్రాంతి పండుగ పురస్కరించుకొని వాలీబాల్ పోటీలు జరపడం అభినందనీయం అన్నారు.ఈ పోటీలు విజయవంతం చేసినందుకు రేగా విష్ణు మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ నుండి 10,000 రూపాయలు నిర్వాహకులకు రేగా అందజేశారు.ఈ కార్యక్రమంలో కరకగూడెం ఎంపీపీ,జడ్పీటీసీ రేగా కాళిక,కొమరం కాంతారావు,ఎస్ఐ గడ్డం ప్రవీణ్ కుమార్,స్థానిక సర్పంచ్ కొమరం విశ్వనాథం,ఉప సర్పంచ్ జాడి నాగరాజు,అనంతరం సర్పంచ్ బత్తిని నర్సింహారావు,రేగా పీఏ చందా హరికృష్ణ,అక్కిరెడ్డి వెంకట్ రెడ్డి,గ్రామ పెద్దలు; పోలెబోయిన వెంకట నారాయణ,గొగ్గల క్రిష్ణ,కొమరంతాతారావు,క్రీడలనిర్వాహకులు;కొమరంఅనిల్,పోలెబోయినరాజబాబు,పోలెబోయిన సుధాకర్,రంజిత్,ప్రసాద్,శ్రీను,లక్ష్మీనారాయణ,సత్యనారాయణ,గ్రామస్థులు పాల్గొన్నారు.
