అత్యధిక గెలుపులతో ఆస్ట్రేలియా రికార్డును బద్దలు కొట్టిన భారత్‌

అత్యధిక గెలుపులతో ఆస్ట్రేలియా రికార్డును బద్దలు కొట్టిన భారత్‌

1
TMedia (Telugu News) :

అత్యధిక గెలుపులతో ఆస్ట్రేలియా రికార్డును బద్దలు కొట్టిన భారత్‌

టీ మీడియా, అక్టోబర్ 25, మెల్‌బోర్న్‌: ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధికంగా అంతర్జాతీయ మ్యాచ్‌లు గెలిచిన జట్టుగా భారత క్రికెట్‌ జట్టు రికార్డు నెలకొల్పింది. సరిగ్గా 19 ఏండ్లపాటు ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు పేరిట ఉన్న ఆ రికార్డును ఇప్పుడు భారత్‌ సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా జట్టు 2003 క్యాలెండర్‌ ఇయర్‌లో మొత్తం 47 మ్యాచ్‌లు ఆడి 38 మ్యాచ్‌లలో విజయం సాధించింది. అప్పటి నుంచి 19 ఏండ్లుగా అదే రికార్డుగా ఉంది.కానీ, ఈ ఏడాది భారత జట్టు ఆ రికార్డును బద్దలు కొట్టింది. టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం ద్వారా భారత్‌ ఈ రికార్డును సొంతం చేసుకుంది.

 

Also Read : స‌మంత యశోద ట్రైలర్‌ రిలీజ్‌ డేట్

 

నిన్నటి గెలుపు భారత జట్టుకు ఈ క్యాలెండర్‌ ఇయర్‌లో 39వ గెలుపు. దాంతో భారత్‌ ఈ క్యాలెండర్‌ ఇయర్‌లో ఇప్పటివరకు మొత్తం 56 మ్యాచ్‌లు ఆడి 39 విజయాలు సాధించినట్లయ్యింది.ఈ ఏడాది ప్రారంభంలో సొంతగడ్డపై వెస్టిండీస్‌తో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడిన భారత జట్టు.. రెండు సిరీస్‌లలోనూ ఆ టీమ్‌ను 3-0తో క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఆ తర్వాత సొంతగడ్డపైనే శ్రీలంక జట్టుతో మూడు టీ20 మ్యాచ్‌లు, రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఇండియన్‌ టీమ్‌.. ఆ రెండు సిరీస్‌లను కూడా వరుసగా 3-0, 2-0తో గెలుచుకుంది. అలా ఇప్పటివరకు వరుస విజయాలు సాధిస్తూ నిన్న పాకిస్థాన్‌తో 39వ విజయం నమోదు చేసింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube