ఐ ఎన్ టి ఎస్ ఓ పరీక్ష ఫలితాలలో శ్రీ చైతన్య విజయదుందుభి

ఐ ఎన్ టి ఎస్ ఓ పరీక్ష ఫలితాలలో శ్రీ చైతన్య విజయదుందుభి

1
TMedia (Telugu News) :

ఐ ఎన్ టి ఎస్ ఓ పరీక్ష ఫలితాలలో శ్రీ చైతన్య విజయదుందుభి

టీ మీడియా, మార్చి14, మధిర:

స్థానిక శ్రీ చైతన్య స్కూల్ టెక్నో కరికులం జాతీయ ప్రతిభా అన్వేషణ పరీక్ష ఐ ఎన్ టి యస్ ఓ లో ఈ విద్యా సంవత్సరానికి గాను జనవరి 24 న నిర్వహించిన పరీక్షలలో స్థానిక చైతన్య స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబరిచారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ప్రిన్సిపాల్ ఆకెళ్ళ భారతి మాట్లాడుతూ… గ్రామీణ విద్యార్థులును సైతం ఇలాంటి జాతీయ స్థాయి పరీక్షలకు సిద్ధం చేస్తున్న శ్రీ చైతన్య ప్రోగ్రాం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ అలాగే దానికి సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులకు పాఠశాల సిబ్బందికి ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ప్రతిభా పరీక్షలో ప్రతిభ కనపరిచిన 38 మంది విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో అకడమిక్ కోఆర్డినేటర్ నాగేంద్ర, ఏజీఎం చేతన్,నవీన్ ప్రోగ్రాం ఇంచార్జ్ నరేష్ పాఠశాల సిబ్బంది విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Also Read : జనన, మరణ ధృవీకరణ ఇబ్బందులు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube