ఆన్‌లైన్‌లోకి వచ్చేసిన శ్రీరామనవమి కల్యాణ టికెట్లు

ఆన్‌లైన్‌లోకి వచ్చేసిన శ్రీరామనవమి కల్యాణ టికెట్లు

0
TMedia (Telugu News) :

ఆన్‌లైన్‌లోకి వచ్చేసిన శ్రీరామనవమి కల్యాణ టికెట్లు..

లహరి, మార్చి2, భద్రాద్రి : భద్రాచలం ఆలయం శ్రీరామనవమి వేడుకలకు ముస్తాబవుతోంది. ఈ క్రమంలో భాగంగానే రాములవారి ఆలయంలో ఈ నెల 22 నుంచి ఏప్రిల్ 5 వరకు శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. మార్చి 30న ఆలయ సమీపంలోని మిథిలా మండపంలో సీతారాముల కల్యాణం జరపనున్నారు. ఈవేడుకను భక్తులు వీక్షించేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన టికెట్లును ఫిబ్రవరి 1 నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతున్నట్లు ఆలయ ఈవో రమాదేవి పేర్కొన్నారు. ఫలితంగా ఈ టికెట్లను www.bhdrachalamaonline.com వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు. రూ.7,500, రూ.2,500, రూ.2000, రూ.1000, రూ.300, రూ.150 టికెట్లు అందుబాటులో ఉంచనున్నారు. అయితే ఏడువేల ఐదువందల టికెట్ పై ఇద్దరికీ ప్రవేశం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు.

Also Read : వైభవంగా నరసింహ స్వామి రథోత్సవం..

మిగతా టికెట్లపై ఒకరి మాత్రమే ప్రవేశించే వీలుంది. టోటల్ గా 16,860 మంది టెకట్లతో మండపంలోనూ, 15వేల మంది స్టేడియం నుంచి ప్రీగా రాములోరి కల్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉంది. ఈనెల 31న శ్రీరామ సామాజ్ర్య పట్టాభిషేకం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి మూడు రకాల టికెట్లను విక్రయించనున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube