భారతదేశ గర్వించదగ్గ గణిత శాస్త్రవేత్త మన రామాంజన్

- ప్రధానోపాధ్యాయులు రామకృష్ణారెడ్డి

0
TMedia (Telugu News) :

భారతదేశ గర్వించదగ్గ గణిత శాస్త్రవేత్త మన రామాంజన్

– ప్రధానోపాధ్యాయులు రామకృష్ణారెడ్డి

టీ మీడియా, డిసెంబర్ 22, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా కేంద్రంలోని లలిత పబ్లిక్ హై స్కూల్ లో శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా, పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖనము ఉపన్యాస పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందుకున్నారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ భారతదేశం గర్వించదగ్గ గణిత శాస్త్రవేత్త రామానుజన్ అని, ఆయన పూర్తి పేరు,శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ బ్రిటీష్ పరిపాలనా కాలంలో భారతదేశానికి చెందిన గణిత శాస్త్రవేత్త అని. 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప గణిత మేధావులలో ఒకరు. శుద్ధ గణితంలో,ఈయనకు శాస్త్రీయమైన శిక్షణ లేకపోయినా గణిత విశ్లేషణ, సంఖ్యా శాస్త్రం, అనంత శ్రేణులు, అవిరామ భిన్నాలు లాంటి గణిత విభాగాలలో విశేషమైన కృషి చేశాడు.అప్పట్లో ఇకపరిష్కారం కావు అనుకున్న సమస్యలకు కూడా ఇతను పరిష్కారం కనుగొన్నాడు. ఈయనలోని గణిత పరిశోధనా ప్రవృత్తి ఏకాంతంలోనే ఎక్కువగా అభివృద్ధి చెందింది అని ఆయన అన్నారు. తన పరిశోధనలతో అప్పట్లో ప్రఖ్యాతి గాంచిన గణిత శాస్త్రవేత్తలకు దగ్గరవ్వాలని ప్రయత్నించాడు, కానీ ఆ ప్రయత్నాలు చాలా వరకు విఫలమయ్యాయి అని ఆయన అన్నారు. ఎందుకంటే రామానుజన్ కనుగొన్న సూత్రాలు అపూర్వమైనవి, అప్పటి దాకా ఎవరూ పరిచయం చేయనివి, దానికితోడు వాటిని రామానుజన్ సమర్పించిన విధానం కూడా విభిన్నమైనది.

Also Read : అంగన్వాడి కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని రాస్తారోకో

అయినా రామానుజన్ తన పట్టు విడవకుండా తన పరిశోధనను అర్థం చేసుకునే శాస్త్రవేత్తలకోసం వెతుకులాట కొనసాగించాడు. 1913లో ఆయన ఇంగ్లండులోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో పనిచేసే జి. హెచ్. హార్డీ అనే గణిత శాస్త్రవేత్తకు ఉత్తరాల ద్వారా సంప్రదించాడు. అతని పనిని చూసి ముగ్ధుడైన హార్డీ రామానుజాన్ని కేంబ్రిడ్జికి ఆహ్వానించాడు. రామానుజన్ ప్రతిపాదించినవి చాలా కీలకమైన సిద్ధాంతాలనీ, కొన్నైతే తాను కనీ వినీ ఎరుగనివని కూడా హార్ది అభిప్రాయపడ్డాడు అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube