శ్రీరాంసాగర్ మరో ఆరుగేట్ల ఎత్తివేత
టి మీడియా,జులై12,హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతున్నది. ప్రస్తుతం జలాశయానికి 81,730 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. ఇప్పటికే 20గేట్ల ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్న అధికారులు తాజాగా.. మరో ఆరుగేట్ల ఎత్తివేశారు. ప్రస్తుతం 26 గేట్లను ఎత్తి దిగువకు 1,07,118 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుతం 1087.50 అడుగుల మేర నీరున్నది. డ్యామ్ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 90.30 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 74.826 టీఎంసీలు నిలువ ఉన్నది.
Also Read : అంగన్వాడీ ల రాస్తారోకో
ఇదిలా ఉండగా.. భద్రాచలం వద్ద అక్రమంగా గోదావరిలో నీటి ప్రవాహం తగ్గుముఖం పడుతున్నది. ఉదయం గంటలకు 52.9 అడుగుల వద్ద నీరు ప్రవహించింది. ప్రస్తుతం అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించగా.. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నది. గోదావరిలో 14,21,034 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతున్నది. వరద కారణంగా భద్రాచలం రామాలయం పడమరమెట్ల వద్దకు వరద నీరు చేరింది. అలాగే అన్నదాన సత్రంలోకి సైతం వరద నీరు చేరింది.స్నానఘట్టాలు, కల్యాణకట్ట, కొత్తకాలనీ, అయ్యప్ప కాలనీలు నీటమునిగాయి. స్థానికులను ఇండ్లను ఖాళీ చేయించి, పునరావాస కేంద్రాలకు తరలించారు. భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చర్లమండలాలకు రాకపోకలు స్తంభించాయి. దుమ్ముగూడెం గంగోలు వద్ద డబుల్ బెడ్రూం ఇండ్లలోకి వరద నీరు చేరింది. సున్నంబట్టిలోకి వరద చేరడంతో పునరావాస కేంద్రానికి 50 కుటుంబాలను తరలించారు. ఇదిలా ఉండగా.. జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టు 24 గేట్లను అధికారులు ఎత్తివేశారు. ప్రాజెక్టు నుంచి 1,07,741 క్యూసెక్కుల వరద దిగువకు చేరుతున్నది.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube