శ్రీరాంపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ భారీగా సక్సెస్
శ్రీరాంపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ భారీగా సక్సెస్
శ్రీరాంపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ భారీగా సక్సెస్
టీ మీడియా, ఏప్రిల్ 19, పెద్దపల్లి బ్యూరో :
పెద్దపల్లి జిల్లా సీఎల్పీ నేత మల్లు బట్టి విక్రమార్క చేస్తున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్ర గురువారం రోజున 35వ రోజు పూర్తి చేసుకొని శ్రీరాంపూర్ మండల కేంద్రంలో అడుగుపెడుతున్న ఆయనకు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్య కార్యకర్తలు మౌనిక రెడ్డి తో పాటు శ్రీరాంపూర్ గ్రామ ప్రజలు స్థానిక కమాన్ కూడలి వద్ద ఘనంగా స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు. అనంతరం బస్టాండ్ ఆవరణలోని అంబేద్కర్ చౌరస్తాలో పులి ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ యువ నాయకులు సమక్షంలో శ్రీరాంపూర్ మండల కేంద్రానికి చెందిన 30 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వారు మాట్లాడుతూ ఇంత ఎండలను లెక్కచేయకుండా స్వాగతం పలికిన శ్రీరాంపూర్ గ్రామ మహిళలకు గ్రామ ప్రజలకు పేరుపేరునా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను అని అన్నారు. ఇన్ని వందల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ మీ అందరితో మాట్లాడుతూ సమస్యలు తెలుసుకుంటూ సమస్యల పరిష్కారానికి మా ప్రయత్నం అని అన్నారు. ఎన్నికలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అడగడానికి రాలేదని ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను మీకు తెలపడానికి తప్ప వేరే ప్రయత్నం కోసం కాదని ఆయన స్పష్టం చేశారు.
AlsoRead:బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
మేము చేస్తున్న ఈ పాదయాత్ర తెలంగాణ ప్రజల సుభిక్షం కోసమని ఇందిరమ్మ రాజ్యం తేవాలనే తపన కోసమని ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందించేందుకే పాదయాత్ర చేస్తున్నామన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఏనాడు నియోజకవర్గ ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదని మట్టి ఇసుక మాఫియా తో డబ్బులు సంపాదించుకుంటూ తమ విద్యాసంస్థలను అభివృద్ధి పరుస్తున్నారు తప్ప ప్రజలకు రైతులకు ఒరగబెట్టింది ఏమీ లేదని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే రైతులకు రెండు లక్షల రుణమాఫీ, గ్యాస్ సిలిండర్ ధర 500 తగ్గించడం, రాష్ట్రంలో రైతుబంధులాగా కూలీ బంద్ తెచ్చి సంవత్సరానికి పూరీల అకౌంట్లో 12000 జమ చేయడం కల్లుగీత కార్మికులకు ఇన్సూరెన్స్ పథకాన్ని తెచ్చి ప్రీమియం ప్రభుత్వమే చెల్లించడం ఇటువంటి సంక్షేమ పథకాలను చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాజ్ ఠాకూర్, మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, కాంగ్రెస్ కిసాన్ రాష్ట్ర చైర్మన్ అన్వేష్ రెడ్డి, గంట రాములు యాదవ్, కాంగ్రెస్ పార్టీ శ్రీరాంపూర్ మండల అధ్యక్షులు ఎండి మునీర్, మాజీ ఎంపీపీ గొప్పవాని సారయ్య గౌడ్, సర్పంచులు ఓరుగంటి కొమురయ్య గౌడ్, మాజీ సర్పంచులు, మాజీ ఎంపిటిసిలు, కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులు, బంగారు రమేష్ దానవీర శ్రీనివాస్ అల్లంల దేవేందర్ సొన్ ఐటెం కం రామకృష్ణ రానా వీణ కాంతి పులి ఇంద్రకరణ్ రెడ్డి, అశేష జన వాహిని తదితరులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube