భక్తులను వెంబడించిన పెద్దపులి
టీ మీడియా, డిసెంబర్ 14, శ్రీశైలం:
శ్రీశైలం నల్లమల అటవీప్రాంతంలో నడకదారిలో వేళ్తున్న భక్తులను పెద్దపులి వెంబడించి పరుగులు పెట్టించింది. కోడుమూరుకు చెందిన భక్తులు సోమవారం శ్రీశైలం వేళ్ళేందుకు నల్లమల అటవీ ప్రాంతం గుండా నడక మార్గంలో బయలుదేరారు. మంగళవారం పెచ్చెరువు సమీపంలో వారిని పెద్దపులి వారిని వెంబడించింది. భక్తులు పెద్ద ఎత్తున హాహాకారాలు చేస్తూ ప్రాణభయంతో పరుగులు తీశారు.విషయం తెలుసుకున్న పోలీసులు, అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడ పరిస్థితిని సమీక్షించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు.