శ్రీశైలం సాగర్‌ నిర్వహణమార్గదర్శకాలను ఖరారు చేయండి

-బ్రిజేశ్‌ ట్రైబ్యునల్‌ను కోరనున్న తెలంగాణ

0
TMedia (Telugu News) :

శ్రీశైలం సాగర్‌ నిర్వహణ మార్గదర్శకాలను ఖరారు చేయండి
-బ్రిజేశ్‌ ట్రైబ్యునల్‌ను కోరనున్న తెలంగాణ
టీ మీడియా ,మార్చి 4,హైదరాబాద్‌ : 1005 టీఎంసీల జలాలను తెలుగు రాష్ట్రాలకు పునర్‌ పంపిణీ చేసే బాధ్యతలు చూస్తున్న శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల నిర్వహణ మార్గదర్శకాలను ఖరారు చేయాలని జస్టిస్‌ బ్రిజే్‌షకుమార్‌ ట్రైబ్యునల్‌ను తెలంగాణ ప్రభుత్వం కోరనుంది. ఈ మేరకు ట్రైబ్యునల్‌లో విజ్ఞప్తిని సమర్పించనుంది. నీటి కేటాయింపుల తర్వాత అత్యంత కీలకమయినవి ఆపరేషనల్‌ గైడ్‌లైన్స్‌ (నిర్వాహణ మార్గదర్శకాలు), రూల్‌ కర్వ్‌లే.

also read: పట్టణాలతో పోటీ పడుతున్న

ఏ సమయంలో ప్రాజెక్టు నిర్వహణలో గేట్లు ఎత్తాలి? జలవిద్యుదుత్పత్తికి కనీస నీటి మట్టం ఎంత? తాగునీటికి ఎంత…? సాగునీటికి ఎక్కడిదాకా నీటిమట్టం ఉంచాలి? వంటివి నిర్వహణా మార్గదర్శకాలు నిర్దేశించనుండగా… ఏ నెలలో ప్రాజెక్టుల్లో ఏ మేర నీటి నిల్వ ఉంచాలనేది రూల్‌ కర్వ్‌ స్పష్టం చేస్తోంది.2013లో బ్రిజే్‌షకుమార్‌ ట్రైబ్యునల్‌ కృష్ణా జలాలను మూడు రాష్ట్రాలకు (మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లకు) పంచింది. తీర్పు అమలు కాకుండా సుప్రీంకోర్టులో కేసు దాఖలు కావడంతో బ్రిజేష్‌ తీర్పుపై న్యాయస్థానం స్టే విధించింది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో… ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ప్రాజెక్టుల వారీగా నీటిని పంచే బాధ్యతను బ్రిజే్‌షకుమార్‌ ట్రైబ్యునల్‌కు అప్పగించారు. మార్చి 31వ తేదీ వరకు బ్రిజే్‌షకుమార్‌ ట్రైబ్యునల్‌లో విచారణ జరగనుంది. ఈలోగా ట్రైబ్యునల్‌లో విజ్ఞప్తిని దాఖలు చేయాలని తెలంగాణ నిర్ణయించింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube