కేసీఆర్ కు అండగా నిలవాలి

- మదన్ లాల్ ను మంచి మెజార్టీతో గెలిపించాలి

0
TMedia (Telugu News) :

కేసీఆర్ కు అండగా నిలవాలి

– మదన్ లాల్ ను మంచి మెజార్టీతో గెలిపించాలి

– కాంగ్రెస్ మాయ మాటలు నమ్మొద్దు

– వైరా ఎన్నికల ప్రచారంలో ఎంపీ నామ

టీ మీడియా, నవంబర్ 25, వైరా : శనివారం ఉదయం వైరా లో పార్టీ అభ్యర్థి బాణోత్ మదన్ లాల్ విజయాన్ని కాంక్షిస్తూ ఎమ్మెల్యే రాములు నాయక్ తో కలిసి వైరా పట్టణంలోని బ్రాహ్మణ పల్లి ,బోడేపూడి కాలనీలు, 7, 8 వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను కూడా ముఖాముఖి ప్రత్యేకంగా కలిసి మాట్లాడి మదన్ లాల్ ను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా కాలనీలో సైడ్ మురుగు కాల్వలను, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను నామ పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక ఓటర్లను ముఖాముఖి కలుసుకొని ప్రత్యేకించి మాట్లాడి మదన్ లాల్ ను మంచి మెజార్టీతో ఆశీర్వదించాలని నామ నాగేశ్వరరావు కోరారు.

కార్యక్రమంలో ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యులు బోయినపల్లి కృష్ణమూర్తి, చిత్తారు సింహాద్రి యాదవ్, నాయకులు పసుపులేటి మోహనరావు, పార్టీ మండల అధ్యక్షులు బాణాల వెంకటేశ్వర్లు,ముళ్లపాటి సీతారాములు,జెట్పీటీసీ నంబూరి కనక దుర్గ, ఎంపీపీ వేల్పుల పావని,దిశా కమిటీ సభ్యులు కట్టా కృష్ణార్జునరావు, టౌన్ పార్టీ అధ్యక్షులు మద్దెల రవి, జడ్పీ కోప్షన్ లాల్ మహమ్మద్,వనమా విశ్వే శ్వరరావు,కాపా మురళి కృష్ణ,5వ వార్డు కౌన్సిలర్,మాదినేని సునీత-దుర్గ ప్రసాద్,కౌన్సిలర్ డాక్టర్ కోటయ్య,కొత్త వెంకటేశ్వర్లు,మోరంపూడి ప్రసాద్ రావు,ఎదునూరి శ్రీను,మొదటి వార్డు కౌన్సిలర్ మరికంటి శివ,చిలక కోటయ్య,నామ సేవ సమితి నుంచి పాల్వంచ రాజేష్, చీకటి రాంబాబు, కృష్ణ ప్రసాద్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Also Read :,రఘుకు పెరుగుతున్న ప్రజాభిమానం

కేసీఆర్ కు అండగా నిలవాలి :
ఈ సందర్భంగా జరిగిన రోడ్డు షోలో ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. వార్డు సభ్యులు, ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున తనకు హారతులిచ్చి ఘన స్వాగతం పలికారని,వారికి రుణపడి ఉంటానని చెప్పారు. తాను కొన్ని ఇళ్లు తిరిగానని, ఏదో ఒక పధకం కింద లబ్ది పొందుతూనే ఉన్నామని ఓటర్లు చెప్పారని తెలిపారు. బడుగు, బలహీనవర్గాల అభివృద్ధికి, సంక్షేమానికి ఎంతో మేలు చేస్తున్న కేసీఆర్ కు అండగా ఉండి, గెలిపించా లన్నారు వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమని ,గెలిచేది మదన్ లాలేనని , మూడోసారి సీఎం అయ్యేది కేసీఆర్ అని స్పష్టం చేశారు. ప్రభుత్వo ఏర్పడగానే బ్రహ్మాండంగా మేనిఫెస్టోను అమలు చేసుకుందామని చెప్పారు.

Also Read : ఆప్‌ ప్రభుత్వం, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఎందుకు చర్చించకూడదు

ఎన్నికలప్పుడు వచ్చి మోసపు మాటలు చెప్పేవారిని నమ్మొద్దని ,వారు పరిపాలించే రాష్ట్రాల్లో అమలు చేయడం చాతగాని పధకాలను ఇక్కడి కొచ్చి చేస్తామంటున్నారని, గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. దేశంలోనే నెంబర్ వన్ అభివృద్ధి సాధించిన కేసీఆర్ కుఅండగా ఉండి, పార్టీ అభ్యర్థులను గెలిపించు కోవాలని నామ నాగేశ్వరరావు కోరారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube