5జీ సేవలకు శ్రీకారం ప్రారంభించిన ప్రధాని

5జీ సేవలకు శ్రీకారం ప్రారంభించిన ప్రధాని

1
TMedia (Telugu News) :

5జీ సేవలకు శ్రీకారం ప్రారంభించిన ప్రధాని

టీ మీడియా, అక్టోబర్1,దిల్లీ: దేశ టెలికాం రంగంలో కొత్త శకం మొదలైంది. దేశంలో 5జీ సేవలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం అందుబాటులోకి తీసుకొచ్చారు. దిల్లీ ప్రగతి మైదాన్‌లో 6వ ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌ – 2022 కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని. దీంతో పాటు 5జీ సేవలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ప్రగతి మైదాన్‌లో ఏర్పాటు చేసిన 5జీ సేవలకు సంబంధించిన ప్రదర్శనను మోదీ ఆసక్తిగా తిలకించారు. ఈ సేవల సామర్థ్యానికి సంబంధించిన డెమోను రిలయన్స్‌ జియో ఛైర్మన్ ఆకాశ్ అంబానీ.. మోదీకి వివరించారు. ఆ తర్వాత 5జీ సేవల పనితీరును మోదీ స్వయంగా పరిశీలించారు.5జీ (5జీ ) సేవలు తొలుత ఎంపిక చేసిన 13 నగరాల్లో ప్రారంభమై, వచ్చే కొన్నేళ్లలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి.

Also Read : 1.40కోట్లతో అభివృధ్ధి పనులు శంకుస్థాపనలు

తొలి దశలో భాగంగా అహ్మదాబాద్‌, బెంగళూరు, చండీగఢ్‌, చెన్నై, దిల్లీ, గాంధీనగర్‌, గురుగ్రామ్‌, హైదరాబాద్‌, జామ్‌నగర్‌, కోల్‌కతా, లఖ్‌నవూ, ముంబయి, పుణె నగరాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. ఇందులో నాలుగు నగరాల్లో టెలికాం సంస్థలు నేటి నుంచే 5జీ సేవలను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.భారత్‌పై 5జీ మొత్తం ఆర్థిక ప్రభావం 2035 నాటికి 450 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.36 లక్షల కోట్ల)కు చేరొచ్చని అంచనా. ప్రస్తుత 4జీతో పోలిస్తే 7-10 రెట్ల డేటా వేగం 5జీ (5జీ ) సేవల్లో లభిస్తుందని, కొత్త ఆర్థిక అవకాశాలు, సామాజిక ప్రయోజనాలు సాధ్యపడతాయని చెబుతున్నారు. దేశంలోని మూడు ప్రైవేటు టెలికాం సంస్థలు 5జీ సేవల కోసం రూ.1.5 లక్షల కోట్ల స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేశాయి. జియో రూ.88,078 కోట్లు, ఎయిర్‌టెల్‌ రూ.43,084 కోట్లు, వొడాఫోన్‌ ఐడియా రూ.18,799 కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేశాయి. అక్టోబరులోనే 5జీ సేవలు తీసుకొస్తామని ఇప్పటికే జియో, ఎయిర్‌టెల్‌ సంస్థలు ప్రకటించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube