చలివేంద్రం ప్రారంభం

టీ మీడియా, ఏప్రిల్ 16, వనపర్తి, బ్యూరో

1
TMedia (Telugu News) :

చలివేంద్రం ప్రారంభం

టీ మీడియా, ఏప్రిల్ 16, వనపర్తి, బ్యూరో : అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి వనపర్తి జిల్లా వనపర్తి పట్టణ కమిటీ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో శనివారం చలివేంద్రం మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఎండ తీవ్రత అధికంగా ఉన్న కారణంగా పాదచారులకు దాహం తీర్చే నిమిత్తం ఉడతాభక్తిగా అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ప్రతి సంవత్సరం తీసుకునే నిర్ణయంలో భాగంగా శనివారం చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి జిల్లా అధ్యక్షులు ముద్దు కృష్ణ గురుస్వామి, ప్రచార కార్యదర్శి నరేందర్ గురుస్వామి, పట్టణ అధ్యక్షులు వెంకటయ్య గురు స్వామి, కార్యదర్శి గట్టు వెంకన్న స్వామి, కె.వి.ఆర్ గురు స్వామి ఆలయ అధ్యక్షులు మారం బాలేశ్వరయ్య, కమిటీ సభ్యులు బి నాగేష్ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ నాగన్న, లక్ష్మీనారాయణ, శశి, రామకృష్ణ, అభిలాష్, సంతోష్ చారి అనేకమంది భక్తులు తదితరులు పాల్గొన్నారు.

 

also read; కనీస వసతలు లేని పాఠశాలలు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube