రాష్ట్ర స్థాయి ఖో-ఖో పోటీలుప్రారంభం

రాష్ట్ర స్థాయి ఖో-ఖో పోటీలుప్రారంభం

1
TMedia (Telugu News) :

రాష్ట్ర స్థాయి ఖో-ఖో పోటీలుప్రారంభం

టీ మీడియా,అక్టోబర్ 22,జగిత్యాల : జిల్లా లోని కొడిమ్యాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో శుక్రవారం రాష్ట్రస్థాయి ఖో-ఖో క్రీడల పోటీలు ఘనంగా సర్పంచ్ ఏలేటిమమత-నర్సింహారెడ్డి ,ముఖ్య అతిథులు జ్యోతి వెలిగించి ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఏలేటి మమత- నరసింహారెడ్డి వహించగా ముఖ్య అతిథులుగా అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి , రాష్ట్ర ఖో-ఖో అధ్యక్షులు రాఘవరెడ్డి హాజరయ్యారు.

ప్రారంభోత్సవంలో విద్యార్థులు చేసిన నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. పది జిల్లాల నుండి వచ్చిన ఖో-ఖో టీమ్స్ మార్చ్ ఫాస్ట్ చేసి పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎలేటి మమత- నర్సింహారెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో కబడ్డీ తర్వాత అత్యంత ఆదరణ పొందిన క్రీడ ఖో-ఖో అని తెలుపుతూ ఆటలు శారీరక సౌష్టవం కొరకు మానసిక ఉల్లాసం కొరకు తరతరాల నుండి ఆటలు ఒక అద్భుతమైన సాధనం గా ఉపయోగపదుతున్నాయని అంతే కాకుండా శారీరక వ్యాయామంతో పాటు మానసిక వికాసం పెరిగి అధికబరువు, ఒత్తిడిని, ఏదో తెలియని వెలితిని ఆటల ద్వారా అధిగమించవచ్చని తెలుపుతూ క్రీడలు మానసిక ఎదుగుదలకు, సోషల్ స్కిల్స్ సాధించడానికి ,టీం వర్క్ ,శారీరక ఎదుగుదలకు కాంపిటీటివ్ స్పిరిట్ ,స్పోర్ట్స్ స్పిరిట్ పెంపొందిస్తాయని అన్నారు.

Also Read : తమ్ముడికి ఓటేయండి.

పది జిల్లాల నుండి వచ్చిన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం మూడు క్రీడా జెండాలు ఎగురవేసి ..శాంతి కపోతాలను గాలిలోకి వదిలిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఖో-ఖో జిల్లా సెక్రెటరీ మహేందర్ రావు, జడ్పిటిసి పుణుగోటి ప్రశాంతి ,ఎంపిటిసి జమాలపురి. రాజేశ్వరి-రాజేందర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాంపల్లి మల్లేశం,రిటర్డ్ హెచ్.ఎం గుడి రఘుపతిరెడ్డి, ఎస్ జి ఎఫ్ సెక్రటరీలు శ్రీనివాస్, శ్యాంప్రసాద్ కృష్ణయ్య, పోచప్ప, కొడిమ్యాల ఆర్గనైజింగ్ సెక్రెటరీలు, రవీందర్ బల్ల మల్లేశం, కృష్ణంరాజు ,అనిల్ డేవిడ్సన్, గుర్రం నర్సయ్య, రాపర్తి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube