నాలుగు నెలల పాటు కోవిడ్ ఫోర్త్ వేవ్ ప్రభావం: నిపుణులు
నాలుగు నెలల పాటు కోవిడ్ ఫోర్త్ వేవ్ ప్రభావం: నిపుణులు
నాలుగు నెలల పాటు కోవిడ్ ఫోర్త్ వేవ్ ప్రభావం: నిపుణులు
టీ మీడియా, జూన్ 8, న్యూఢిల్లీ: కరోనా వేవ్ వస్తోందంటే జనం ముందుగానే భయపడే రోజులివి.. అందులో ఎటవంటి సందేహం లేదు. ప్రజలు చాలా అప్రమత్తంగా ఉన్నారు. కానీ థర్డ్ వేవ్ ప్రభావం పెద్దగా లేకపోవడంతో ఫోర్త్ వేవ్ ను అందరూ లైట్ తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఫోర్త్ వేవ్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. నిర్లక్ష్యం వహిస్తే పెనుముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. రెండున్నరేళ్ల క్రితం కరోనా మహమ్మారి ఇంటి నుంచి కాలు బయట పెట్టనీయలేదు. ప్రాణభయం వెంటాడడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. జీవన ప్రయాణానికి లాక్ పడింది. క్రమంగా కరోనా ప్రభావం పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో రెండున్నరేళ్ల తర్వాత జనజీవనం పట్టాలపై పరుగులు తీస్తోంది. మళ్లీ పూర్వ వైభవం వచ్చిందా అన్నట్లుగా అంతటా రద్దీ వాతావరణం నెలకొంది. ఉత్సవాలు, పెళ్లిళ్లు, వేడుకలు, జాతరలు జనంతో కలకలలాడుతున్నాయి.
Also Read : క్రెడిట్ కార్డుతో యూపీఐ లింకింగ్‌కు ఆర్బీఐ అనుమతి
ప్రస్తుతం మళ్లీ ఫోర్త్ వేవ్ భయం ఆందోళన కలిగిస్తోంది. జూన్ 22 నుంచి అక్టోబర్ 24 వరకు అంటే నాలుగు నెలలపాటు ఫోర్త్ వేవ్ ప్రభావం ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.కాన్పూర్ ఐఐటీకి చెందిన పరిశోధకులు ఫోర్త్ వేవ్‌పై కీలక విషయం వెల్లడించారు. అయితే దీని తీవ్రతపై మాత్రం వారు క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. కొత్త వేరియంట్లు, మ్యూటేషన్లు, వ్యాక్సిన్లు, బూస్టర్ డోసుల ప్రభావం ఆధారంగా ఫోర్త్ వేవ్ ప్రభావం ఎలా ఉందో అంచనా వేయొచ్చు. బూస్టర్ డోసు వల్ల కలిగే ఇమ్యూనిటీ నిలబడగలితే పోర్ వేవ్ ప్రభావం కూడా పెద్దగా ఉండకపోవచ్చు. ఇమ్యూటీని మించి మ్యూటేషన్ ఇబ్బంది పెడితే మాత్రం ఫోర్త్ వేవ్ ప్రభావం గట్టిగా ఉంటుంది.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube