ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించిన వైస్ చైర్మన్

ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించిన వైస్ చైర్మన్

1
TMedia (Telugu News) :

ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించిన వైస్ చైర్మన్

టీ మీడియా, మే 2, వనపర్తి, బ్యూరో : వనపర్తి పట్టణంలో 30వ వార్డులో నూతనంగా ఏర్పడిన కాలనీలో తీవ్ర లోవోల్టేజీ సమస్య ఏర్పడడంతో కాలనీవాసులు స్థానిక కౌన్సిలర్ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ దృష్టికి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా విద్యుత్ అధికారులను సమస్యను తీర్చాలని ఆదేశించారు. దాంతో స్పందించిన అధికారులు నూతన ట్రాన్స్ఫార్మర్ తో పాటు నూతనంగా విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు.

Also Read : ప‌దేండ్ల‌లో 16 ల‌క్ష‌ల ఉద్యోగాలు సృష్టిస్తాం

మంత్రి నిరంజన్ రెడ్డికి ట్రాన్స్కో డిఈ, ఏఈకి వైస్ చైర్మన్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేస్తూ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్కి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీధర్, సుదర్శన్ గౌడ్, ప్రవీణ్ కుమార్, శివ, మాధవరావు, గోపాల్, జాగృతి కాలేజ్ ప్రిన్సిపల్ వినోద్ రెడ్డి, ఏఈ రాజా గౌడ్, లైన్మెన్ రాఘవాచారి తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube