బిజెపి రాష్ట్ర కార్యాలయం ముట్టడి చేస్తాం

బిజెపి రాష్ట్ర కార్యాలయం ముట్టడి చేస్తాం

1
TMedia (Telugu News) :

బిజెపి రాష్ట్ర కార్యాలయం ముట్టడి చేస్తాం

టీ మీడియా, ఆగస్టు 6, వనపర్తి బ్యూరో : ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని బిజెపి కార్యాలయం ముట్టడి చేసిన ఎంఆర్పిఎస్, తెలంగాణ దండోరా, తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బిజెపి రాష్ర్ట కార్యాలయం ముట్టడి చేశారు. వ్యవస్థాపక అధ్యక్షుడు ముత్యపగ నర్సింగ్ రావు మాదిగ, తెలంగాణ దండోరా వ్యవస్థాపక అధ్యక్షులు మీసాల రాము మాదిగ, తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గడ్డ యాదయ్య మాదిగ, లు మీడియాతో మాట్లాడారు.వర్గీకరణ బిల్లును తక్షణమే పార్లమెంట్లో ప్రవేశపెట్టి, జనాభ దమాషా ప్రకారం ఎస్సీ రిజర్వేషన్ చేయాలని, ఎస్సీ వర్గీకరణను రాష్ట్రాలు చేసుకునే విధంగా పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేశారు.

 

Also Read : జయశంకర్ కలల్ని సాకారం చేద్దాం

 

ఈ కార్యక్రమంలోని బహుజన అభివృద్ధి సంక్షేమ సంఘం స్టేట్ కోఆర్డినేటర్ యాతకుల శేఖర్ మాదిగ, మహా ఎంఆర్పిఎస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జాజాల రమ్య మాదిగ, తెలంగాణ దండోరా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈదునూరి ఆంజనేయులు మాదిగ, తెలంగాణ దండోరా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఈదునూరి నాగమణి మాదిగ, తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గజ్జల సంపూర్ణ, రాష్ట్ర కార్యదర్శి గోర్ల సరస్వతి, తెలంగాణ దండోరా రాష్ట్ర కార్యదర్శి కల్మురి రాములు మదిగ, నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఇన్చార్జి మంతటి గోపి మాదిగ,తెలంగాణ దండోరా యువసేన రాష్ట్ర కార్యదర్శి మీసాల నాగరాజు మాదిగ, తెలంగాణ దండోరా స్టూడెంట్ ఆర్గనైజేషన్ స్టేట్ కోఆర్డినేటర్ మీసాల ఎల్లేష్,తెలంగాణ దండోరా స్టూడెంట్ ఆర్గనైజేషన్ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు ఎత్తం శివకుమార్, జిల్లా నాయకులు వెంకటస్వామి, దుబ్బాక లక్ష్మణ్, ముత్యపగ శ్రీశైలం, కొంగరి ముఖేష్, తెలంగాణ దండోరా యువసేన వీపనగండ్ల మండల అధ్యక్షులు మీసాల శివ, తెలంగాణ దండోరా స్టూడెంట్ ఆర్గనైజేషన్ వీపనగండ్ల మండల అధ్యక్షుడు గడ్డమీద రాధాకృష్ణ, తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల బాధ్యతలు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube