రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోంది

-ఏపీ బడ్జెట్‌ సమావేశాల లో గవర్నర్‌

0
TMedia (Telugu News) :

రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోంది
-ఏపీ బడ్జెట్‌ సమావేశాల లో గవర్నర్‌

అమరావతి :భోగాపురం ఎయిర్‌పోర్టును వేగవంతం చేసేందుకు కేంద్రంతో సంప్రదింపులు జరుగుతున్నాయని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ చెప్పారు. ఎంఎస్‌ఎంఈలకు రూ. 2363.2 కోట్ల పారిశ్రామిక ప్రోత్సాహకాలు అందించామని అన్నారు. వైఎస్సార్‌ జగన్‌ బడుగు వికాసం కింద షెడ్యూల్‌ కులాల పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. పారిశ్రామిక నైపుణ్యం కోసం రెండు విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దేశంలోనే తొసారిగా మైక్రోసాఫ్టు అప్‌స్కి‍ల్లింగ్‌ కార్యక్రమాన్ని ప్రారంభించామని పేర్కొన్నారు. 2.98 లక్షలకు గాను 2.87 లక్షల ఫిర్యాదులు పరిష్కరించామని గవర్నర్‌ తన ప్రసంగంలో వివరించారు. ​వైఎస్సార్‌ చేయూత ద్వారా 45-60 ఏళ్ల మహిళలకు రూ.9,100 కోట్లు అందించామని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ తెలిపారు. వైఎస్సార్‌ కాపు నేస్తం కింద ఐదు విడతల్లో రూ. 75 వేల చొప్పున ఆర్థిక సాయం చేసినట్లు పేర్కొన్నారు

also read:బాబాయితో వివాహేతర సంబంధం.

. కాపు నేస్తం కింది ఇప్పటివరకు రూ. 981.88 కోట్లు అందించామని తెలిపారు. ఈబీసీ నేస్తం కింద ఏడాదికి రూ. 15 వేల చొప్పున సాయం చేస్తున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంత రోడ్ల అభివృద్ధి కోసం రూ.6,400 కోట్ల వ్యయంతో 3 వేల కిలో మీటర్ల పొడవున 2 లైన్ల రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ రాష్ట్రానికి జీవనాడిగా ఉందిని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు. 2023 జూన్‌ నాటికి పోలవరం పూ​ర్తి చేసేలా యుద్ధ ప్రాతిపదిక పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. వేగవంతమైన అభివృద్ధికి వ్యూహాత్మక మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. భావనపాడు, రామాయపట్నం, మచిలీపట్నం వద్ద 3 ఓడరేవుల అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రైతు భరోసా కింద ప్రతి రైతుకు రూ. 13,500 చొప్పున ఆర్థిక సాయం అందజేసినట్లు గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ తెలిపారు. ఇప్పటివరకు 52.38 లక్షల మంది రైతులకు రూ. 20, 162 కోట్ల సాయం చేశామని పేర్కొన్నారు. 9 గంటల ఉచిత విద్యుత్‌ పథకం కింద 18.55 లక్షల మంది రైతులకు ప్రయోజంన చేకూర్చినట్లు గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ తెలిపారు.

also read:భట్టి పాదయాత్రకు పలువురు సంఘీభావం

2021-2022లో రూ.9,091 కోట్ల వ్యయంతో రైతులుకు ప్రయోజనం చేకూర్చామని పేర్కొన్నారు. వైఎస్సార్‌ నేతన్న నేస్తం కింద 81,703 మంది లబ్ధిదారులకు రూ. 577 కోట్ల సాయం చేసినట్ల తెలిపారు. జగనన్న చేదోడు పథకం కింద రజకులు, నాయీ బ్రహ్మణులకు రూ. 583 కోట్ల సాయం అందించినట్లు పేర్కొన్నారు. జగనన్న తోడు ప్రథకం కింద చిరు వ్యాపారులకు రూ.1,416 కోట్ల సాయం అందజేసినట్లు గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ తెలిపారు. వైఎస్సార్‌ వాహన మిత్ర కింద ఆటో, టాక్సీ డ్రైవర్లకు రూ. 770 కోట్ల సాయం చేశామని చెప్పారు. వైఎస్సార్‌ ఆసరా కింద స్వయం సహాయక సంఘాలకు 12,758 కోట్ల సాయం, వైఎస్సార్‌ సున్నా వడ్డీ కింద రూ.2,354 కోట్లు అందించామని అన్నారు. జగనన్న వసతి దీవెన కింద 18.77 లక్షల మంది విద్యార్థులకు రూ.2,304 కోట్లు జమ చేశామని తెలిపారు. కొత్తగా 16 మెడికల్‌ కాలేజీలు ప్రతిపాదించామని అన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో కిడ్నీ పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేశామని అన్నారు. ఉద్యోగుల వయో పరిమితిని 60 నుంచి 62 ఏళ్లకు పెంచామని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ తెలిపారు. 2020-2021 ఏడాదికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 16.82 శాతం సమగ్ర వృద్ధి సాధించిందని అన్నారు.

also read:చిరు వ్యాపారులకు మహర్దశ..!

మన బడి నాడు-నేడు కింద ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి జరుగుతోందని, తొలి దశలో రూ.3,669 కోట్లు ఖర్చు చేసి 17,715 పాఠశాలను అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. 44.5 లక్షల మంది తల్లులకు అమ్మఒడి కింద రూ. 13,023 కోట్లు అందజేశామని చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ తెలిపారు. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన కొనసాగుతుందని అన్నారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో ఏపీ మెరుగైన అభివృద్ధి సాధింస్తోందని తెలిపారు. పాలన కింది స్థాయి వరకు విస్తరించేలా గ్రామ సచివాలయాలు పని చేస్తున్నాయని పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు పారదర్శంగా పనిచేస్తున్నాయని గవర్నర్‌ తెలిపారు. కోవిడ్‌ వల్ల రెండేళ్ల నుంచి దేశం, రాష్ట్రం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నాయని, గత మూడేళ్లుగా వికేంద్రీకృత, సమ్మిళిత పాలన ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ప్రభుత్వానికి ఉద్యోగులను మూలస్తంభాలుగా భావిస్తున్నామని తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube