రాష్ట్ర ఐఎన్టీయూసీగా వనపర్తి మహిళ

రాష్ట్ర ఐఎన్టీయూసీగా వనపర్తి మహిళ

1
TMedia (Telugu News) :

రాష్ట్ర ఐఎన్టీయూసీగా వనపర్తి మహిళ

టి మీడియా, జూన్ 24, వనపర్తి బ్యూరో : రాష్ట్ర ఐఎన్టీయూసీ మహిళా అధ్యక్షురాలుగా వనపర్తి మహిళ నాజా జాతీయ అధ్యక్షుడు బుద్ధారం మురహరి భార్య బీటివి రిపోర్టర్ శరణ్య రెడ్డికి చోటు దక్కింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రంగాల కార్మికులకు, ప్రత్యేకంగా మహిళా కార్మికులకు అందించవలసిన వసతుల విషయంలో ప్రభుత్వం చూపే నిర్లక్ష్యం అంతా ఇంతలేదని మరీ ముఖ్యంగా తాపీ రంగ మహిళా కార్మికులకు ఇన్సూరెన్స్ కానీ, లేబర్ ఐడి కార్డులు ఇవ్వటంలో కానీ, వారికి కాన్పులకు ఇవ్వవలసిన ఆర్థిక సహాయంలో నిర్లక్ష్యం, అడ్డా కూలీలకు అడ్డాల దగ్గర మంచి నీటి వసతి, బాత్రూం వసతి, షెడ్లు వంటివి ఏవి కలిపించడం లేదని ఇవే కాక ఎతైన భవన నిర్మాణం వంటివి చేపట్టిన సమయంలో వారికి సరియైన రక్షణ వసతులు కల్పించటం లేదని .

Also Read : బొడ్రాయి పండుగ కార్యక్రమంలో ఎమ్మెల్యే

ఇలాంటి అనేక అంశాలపై ఉద్యమ బాటపడతానని అదే విధంగా కార్మికుల ఐక్యత కోసం పెద్ద ఎత్తున అవగాహనా కార్యక్రమాలు చేపట్టి మహిళా కార్మికులకు జరుగుతున్న అన్యాయాలపై పెద్ద ఎత్తున ఉద్యమించేలా తన నిర్ణయాలు ఉండబోతున్నాయని రాష్ట్రంలో మహిళా కార్మికులపై జరుగుతున్న అఘాయిత్యాలతోపాటు వారికి వసతులు కల్పించే విషయంలో ప్రభుత్వాల మొండివైఖరిపై ఉద్యమాలు చేపట్టి మహిళలకు పెద్దపీట వేసేలా అన్ని రంగాల మహిళ కార్మికులను చైతన్యం చేస్థానని ఈ సందర్భంగా ఆమె మీడియా ముఖంగా తెలియజేశారు. ఐఎన్టీయూసి రాష్ట్ర మహిళ అధ్యక్షురాలిగా వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసి మహిళలకు ఏ అన్యాయం జరిగినా తాను ముందుండి పోరాటం చేస్తానని, ఈ ఎన్నికకు ఏకగ్రీవంగా అవకాశం కల్పించిన జాతీయ ఐఎన్టీయూసి అధ్యక్షులు స్వామినాదన్ జైస్వాల్ కు, తెలంగాణ ప్రదేశ్ ఐఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్కచేను సాయిబాబాకు ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube