స్లేట్ హై స్కూల్ విద్యార్థులకు రాష్ట్రస్థాయిలో అవార్డులు

స్లేట్ హై స్కూల్ విద్యార్థులకు రాష్ట్రస్థాయిలో అవార్డులు

0
TMedia (Telugu News) :

స్లేట్ హై స్కూల్ విద్యార్థులకు రాష్ట్రస్థాయిలో అవార్డులు

టీ మీడియా, జనవరి19, జన్నారం : మండలంలోని స్లేట్ హై స్కూల్ విద్యార్థులు రాష్ట్రస్థాయిలో అవార్డులు అందుకున్నారు.ఈ_డాక్ వారు నిర్వహించిన ఈ-డాక్ ఇగ్నిట్ అనే కార్యక్రమంలో జన్నారం మండలం స్లేట్ హై స్కూల్ విద్యార్థులు వివిధ రంగాలలో రాష్ట్రస్థాయి అవార్డులు సాధించారు. ఈ పోటీలలో ఎం.ప్రణవి (3 వ తరగతి) రాష్ట్రస్థాయిలో మొదటి బహుమతి గెలుచుకుంది. ఎస్.సాహిత్య (5వ తరగతి) రాష్ట్ర స్థాయిలో రెండవ బహుమతి గెలుచుకుంది. అలాగే ఐ టీచ్ ఆక్టివిటీలో ఏ.శాన్వి (2వ తరగతి), ఎం.డి ఉజేయిర్ (3వ తరగతి), ఆర్.రితేష్ (5వ తరగతి) రాష్ట్రస్థాయిలో కన్సోలేషన్ బహుమతులు గెలుచుకున్నారు.

Also Read : కంటి వెలుగు ను ప్రారంభించిన మంత్రి

బహుమతులు గెలుచుకున్న విద్యార్థులను అలాగే నృత్యాచారిని నర్మదా, డాన్స్ మాస్టర్ పవన్ ను పాఠశాల ప్రిన్సిపల్ ఏనుగు శ్రీకాంత్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ఏనుగు శ్రీకాంత్ రెడ్డి కేవలం చదువులోనే కాకుండా వివిధ రంగాలలో విద్యార్థులు రాణించేందుకు స్లేట్ పాఠశాలలో వివిధ రకాల కో-కరిక్యులర్ యాక్టివిటీస్ ని బోధించడం జరుగుతుందని తెలియజేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube