సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం విస్తృత అభివృద్ధి

టీఆర్ఎస్ లోక్‌స‌భ ప‌క్ష నేత నామ

1
TMedia (Telugu News) :

సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం విస్తృత అభివృద్ధి

టీఆర్ఎస్ లోక్‌స‌భ ప‌క్ష నేత నామ

టి మీడియా,మే25,ఖమ్మం : ఉద్య‌మ నేత, సీఎం కేసీఆర్ పోరాడి సాధించిన తెలంగాణలో గ‌త ఎనిమిది సంవ‌త్స‌రాలుగా పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుంద‌ని టీఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత, ఎంపీ ఖమ్మం నామ నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం నాడు ఖమ్మం జిల్లాలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవాల్లో రాష్ట్ర మంత్రులు సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్ కుమార్ ,వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ లతో కలసి ఆయన పాల్గొన్నారు ముందుగా ఖమ్మం నగరంలో రూ.110 లక్షల రూపాయల తో నిర్మించిన గిరిజన భవన ప్రారంభోత్సవం లో పాల్గొన్నారు. అనంతరం రఘునాథపాలెంలో రూ. 20 కోట్ల రూపాయల తో నూతనంగా నిర్మించనున్న స్కూల్ ఆఫ్ ఎక్స్ లెన్స్ బాలుర గురుకుల పాఠశాల మరియు కళాశాల భవన నిర్మాణానికి జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు అలానే సింగరేణి మండలం రేలకాయలపల్లి గ్రామం వద్ద రూ. 22 కోట్ల రూపాయల తో నూతనంగా నిర్మించనున్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సంద‌ర్భంగా ఆయ‌న అక్కడ జరిగిన సభల్లో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ పిల్లలు గొప్పగా చదువుకోవాల‌ని , ఉన్నత స్థాయి లో వారు ఉండాలనే సంకల్పంతో టీఆర్ఎస్ ప్ర‌భుత్వం చర్యలు చేప‌ట్టింద‌న్నారు. ఢిల్లీలో మన సీఎం కేసీఆర్ తో కలిసి అనేక స్కూళ్లు చూశామ‌ని తెలిపారు. అక్కడ ఉన్న కొన్ని మౌలిక వసతులను తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని కేసీఆర్ ఇక్కడ అధికారులను ఆదేశించిన‌ట్టు చెప్పారు. కేసీఆర్ లాంటి నాయకుడు దొరకడం మన అదృష్టమ‌ని… అన్ని వర్గాలను సీఎం అభివృద్ధి పరుస్తున్నార‌న్నారు. మన యువ నేత కేటీఆర్ దావోస్ పోతే అక్కడ పారిశ్రామిక వేత్తలు క్యూ కడుతున్నారని హ‌ర్షం వ్య‌క్తం చేశారు. మన రాష్ట్రంలో ఉన్న జాతీయ పార్టీల ఎంపీలు రాష్ట్ర అభివృద్ధిపై పార్లమెంట్ లో ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Also Read : భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి

కానీ ఇక్క‌డ మాత్రం లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వ‌జ‌మెత్తారు. తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచి మన గురించి మాట్లాడని నాయకులు మనకెందుకని నిల‌దీశారు. ఈ విష‌యంపై ప్ర‌జ‌లు ఆలోచ‌న చేయాల‌ని సూచించారు. రాష్ట్ర అభివృద్ధి అడ్డుకునే కుట్రలు జరుగుతున్నాయ‌ని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు అభివృద్ధి చెందకుండా జాతీయ పార్టీల నాయకులు కుట్రలు పన్నుతున్నారన్నారు. అయితే ఈ సంద‌ర్భంలోనే మ‌నమంతా కేసీఆర్ కి అండగా ఉండి రాష్ట్రాన్ని కాపాడుకోవాల‌ని స్ప‌ష్టం చేశారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా పిల్ల‌లను బాగా చ‌దివించాల‌ని సూచించారు. దేశంలో ఉచితంగా క‌రెంటు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్ర‌మేన‌ని అన్నారు. వ్య‌వ‌సాయం కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌రిత‌పిస్తుంద‌ని వివ‌రించారు. వ్య‌వ‌సాయం, రైతుల విషయంలో రాష్ట్ర ప్ర‌భుత్వం పార్టీల‌కు అతీతంగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని చెప్పారు. రైతుల‌కు అండ‌గా ఉన్నామ‌న్నారు. కేంద్ర ప్ర‌భుత్వం రైతుల‌కు అన్యాయం చేస్తుందని అన్నారు. 70 ఏండ్ల‌లో వ్య‌వ‌సాయానికి క‌రెంటు ఇచ్చారా అని అలానే రైతుబంధు, రైతుబీమా ఎందుకు ఇవ్వ‌లేద‌ని ప్ర‌శ్నించారు. మ‌న రాష్ట్రంలో ప‌థ‌కాలు అద్భుతంగా ఉన్నాయ‌ని క‌ర్నాట‌క‌, మ‌హారాష్ట్ర ప్రాంతాల‌కు చెందిన స‌రిహ‌ద్దు ప్రాంతాల ప్ర‌జానీకం తెలంగాణ రాష్ట్రంలో క‌లుస్తామ‌ని అంటున్నార‌న్నారు. కేంద్రం డ‌బ్బులు అంటున్నార‌ని, రాష్ట్రాల నుంచి టాక్సు వ‌సూలు చేసిన డ‌బ్బులు కాదా అని ప్ర‌శ్నించారు. మ‌న డ‌బ్బు తీసుకొని అందులో సగం కూడా ఇవ్వ‌డం లేద‌ని మండిప‌డ్డారు. పైపెచ్చు కేంద్రం ఇచ్చింద‌ని కొంద‌రు నేత‌లు కేంద్రం చెప్ప‌డం దారుణం అన్నారు.

Also Read : డిప్యూటీ మేయర్ఆకస్మిక పర్యటన

ఈ కార్యక్రమాల్లో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, ఖమ్మం నగర మేయర్ పునకొల్లు నీరజ, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్, ఐటిడిఏ పిఓ పి.గౌతమ్, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, ఖమ్మం డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీ ప్రసన్న, ఆర్.జె.సి కృష్ణ, కార్పొరేటర్ పగడాల శ్రీవిధ్య, రఘునాథపాలెం ఎంపీపీ భూక్య గౌరి, జడ్పీటిసి సభ్యురాలు మాళోతు ప్రియాంక, రజిని, శారద, సింగరేణి ఎంపీపీ శకుంతల, జడ్పీటీసీ జగన్, శంకర్, రమణ, ఖమ్మం నగర పార్టీ అధ్యక్షులు పగడాల నాగరాజు, మండల పార్టీల అధ్యక్షులు అజ్మీరా వీరునాయక్, తోటకూర రాంబాబు సహా పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube