టీ మీడియా అక్టోబర్ 19 వనపర్తి : వనపర్తి జిల్లా బిజెపి పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి. కృష్ణ మరియు జిల్లా నాయకులు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 100 కోట్ల ఉచిత కరోనా టీకాలను పంపిణీ చేసిన నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. మన దేశాన్ని గత రెండు సంవత్సరాల నుంచి కరోన మహమ్మారి నుంచి దేశ ప్రజలంతా ప్రపంచమంతా కూడా అనారోగ్యం బారిన పడిన ప్రజలు భయబ్రాంతులతో జీవిస్తున్న తరుణంలో మన ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పందించి దేశం కోసం ప్రజల కోసం ఉచితంగా కరోనా టీకాలను పంపిణీ చేయాలని ఒక పెద్ద ఉద్దేశంతో ముందుకు వచ్చినందుకు నరేంద్ర మోడీకి ధన్యవాదాలు మరియు ఈ రోజు వరకు మన దేశంలో ఉచితంగా పంపిణీ చేసి చరిత్రలో మిగిలిపోయారు. ప్రజలకు ఆపద వచ్చినప్పుడు ఆదుకునేవాడే నిజమైన పాలకుడని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి. కృష్ణ అన్నారు.
మన దేశంలో కాకుండా ప్రపంచ దేశాలకు ఉచిత టీకాలను పంపిణీ చేసిన ఘనత మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీదే దేశంలో ఏ విపత్తు వచ్చినా నేనున్నానని భరోసా కల్పిస్తున్న నరేంద్ర మోడీకి దేశ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా ముందు ముందు కూడా ప్రతి ఒక్కరికీ కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నారని బిజెపి నాయకులు విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి .కృష్ణ, కోశాధికారి శ్రీనివాసులు, వనపర్తి అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ గౌడ్, వాణిజ్య సెల్ జిల్లా కన్వీనర్ మీడియా ఇన్ఛార్జి బచ్చురాము, బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.