రాష్ట్రాలు కూలుస్తున్న కేంద్రం

కేసీఆర్ కు అండగా ఉండాలి

1
TMedia (Telugu News) :

రాష్ట్రాలు కూలుస్తున్న కేంద్రం

-కేసీఆర్ కు అండగా ఉండాలి

టి మీడియా, నవంబరు 10, బోనకల్ : కేంద్రంలోని పార్టీ కుల, మతాలు, అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టి, విభజన రాజకీయాలు చేస్తుందని, ప్రతి ఒక్కరూ జాగరూకతతో అప్రమత్తమవ్వాలని టీఆర్ ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు అన్నారు.బోనకల్ మండలం కలకోట లో గురువారం బీటీ రోడ్డుకు ఎంపీ నామ, ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజుతో కలసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్బంగా స్థానిక స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నామకు ఎదురేగి ఘన స్వాగతం పలికారు. పూలు చల్లి, గ్రామం లోకి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా జరిగిన సభలో నామ మాట్లాడుతూ కేంద్రంలోని పార్టీ అప్రజాస్వామిక రాజకీయాలు వల్ల ప్రజాస్వామ్య బద్దంగా గెలిచిన రాష్ట్రాలు ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు. తెలంగాణా ప్రభుత్వాన్ని కూల్చేoదుకు చేసిన కుట్రలను మన నాయకుడు , సీఎం కేసీఆర్ సమర్థవంతంగా తిప్పికొట్టారని అన్నారు.

Also Read : భువనేశ్వర్‌ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

కేంద్రంలోని పార్టీ ప్రజా ఓటు తో గెలిచే సత్తా లేక దొడ్డిదారిన ప్రజా ప్రభుత్వాలను దొడ్డి దారిలో కూలుస్తుందని నామ ధ్వజమెత్తారు.అందరం సమైక్యమై కలసి మెలసి ఉంటూ కేసీఆర్ అండతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. జిల్లాలో మధిర నియోజకవర్గం తో సహా రూ.123 కోట్లతో 26 అభివృద్ధి పనులు చేసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, జిల్లా పరిషత్ ఛైర్మన్ లింగాల కమలరాజు, పార్టీ బోనకల్ మండల అధ్యక్షులు చేబ్రోలు మల్లికార్జునరావు, నాయకులు బంధం శ్రీనివాసరావు, సుధాకర్, జానకీపురం సర్పంచ్ చిలకా వెంకటేశ్వర్లు, కలకోట, మోటమర్రి, నారాయణపురం, తదితర గ్రామాల సర్పంచ్ లు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube