బాబు జగ్జీవన్ రాం విగ్రహం ఏర్పాటు చేయాలి

0
TMedia (Telugu News) :

టి మీడియా డిసెంబర్ 28 వనపర్తి : వనపర్తి పట్టణంలో మాదిగ కుల సంఘం ఆధ్వర్యంలో మాదిగల చిరకాల కోరిక అయినా జాతీయ నాయకుడు భారత ప్రధానిగా దేశానికి సేవలు అందించిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని నిర్మించుటకు ఎంతోకాలం నుండి అధికారులకు మరియు రాజకీయ నాయకులకు విన్నవించుకోవడం వినతిపత్రం పత్రాలు ఇవ్వడం జరిగింది. కానీ మా దళితుల సమస్యలు ఎవరు కూడా పట్టించుకున్న పాపానపోలేదు. ప్రస్తుతం వనపర్తి పట్టణములో పట్టణ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో సుందరీకరణ మినీ ట్యాంక్ బండ్ పై మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేస్తూ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం ప్రభుత్వం ఖర్చులతో మహనీయుని జన్మదినం ఏప్రిల్ 5వ తేదీన అధికారికంగా ప్రతిష్ఠించగలరని కోరుతూ మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube