బాబు జగ్జీవన్ రావ్ విగ్రహం స్థాపించాలి

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 22 వనపర్తి : వనపర్తి జిల్లా కేంద్రంలోని మారెమ్మ కుంట మలుపు దగ్గర ప్రభుత్వ భూమి లోని 5 గుంటలు 2007లో మున్సిపల్ తీర్మానంలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం కోసం తీర్మానం చేయడం జరిగింది. అట్టి స్థలాన్ని నేడు ప్రైవేట్, అధికార పార్టీ వ్యక్తులు కబ్జా చేసుకొని దానిలో ఫ్లాట్లు వేయడానికి ప్రయత్నిస్తున్నారు. బుధవారం అన్ని అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆ స్థలాన్ని రక్షించాలని కబ్జా కోరల నుండి విడిపించాలని బాబు జగ్జీవన్ రావ్ విగ్రహాలు స్థాపించాలని అఖిలపక్ష పార్టీలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం నుండి ఆంజనేయులు, కురుమయ్య, సిపిఐ జిల్లా అధ్యక్షుడు చంద్రయ్య, ప్రజా సంఘాల నాయకుడు గంధం నాగరాజు, బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు చిరంజీవి, మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్, 21 వవార్డు కౌన్సిలర్ వెంకటేష్, వైఎస్సార్ పార్టీ నాయకులు వెంకటేష్, టీజేఎస్ శివ, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తులో బాబు జగ్జీవన్ రావు విగ్రహం సాధించకపోతే ఆందోళన చేస్తామని అఖిలపక్ష నాయకులు హెచ్చరించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube