తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్ విగ్రహం ధ్వంసం.

0
TMedia (Telugu News) :

నిందుతుల పై కఠిన చర్యలు  తీసుకోవాలి … పోశం నరసింహారావు .

టీ మీడియా, నవంబర్,18 మణుగూరు:

మణుగూరు బొంబాయి కాలనీ లో ఉన్న తెలంగాణ ఉద్యమనేత , తెలంగాణ సిద్ధాంత కర్త ప్రోఫెసర్ జయశంకర్ విగ్రహాని రాత్రి గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు . జయశంకర్ విగ్రహాని ధ్వంసం చేసి మణుగూరు లో అశాంతి, అలజడి ని సృష్టించాలని చూస్తున్నవారు ఎంతటి వారైనా వదిలి పెట్టేది లేదని పోలీస్ లు జయశంకర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందుతులను కనిపెట్టి కఠిన మైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం తరఫున , టిఆర్ఎస్ పార్టీ, తరువున జెడ్పీటీసీ పోశం నరసింహా రావు డిమాండ్ చేశారు .

ఈ ప్రాంత నిధులు, నీళ్లు తెలంగాణ బిడ్డలకు దక్కాలని ఆఖరి శ్వాస వరకు అలుపెరగని పోరాటం చేసిన మహాయోధుడు జయశంకర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసి అవమానించడం దురదృష్టకరమన్నారు. జాతియోద్యమ నాయకులు, ఉద్యమకారుల విగ్రహాలపై దాడులకు తెగబడటం సరికాదని, నిందితుల ను కఠినంగా శిక్షించడం ద్వారా భవిష్యత్‌లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్‌ శాఖ అధికారులను కోరారు . టిఆర్ఎస్ పార్టీ తరుపున కొద్ది రోజుల్లో నే కొత్త విగ్రహాని ఇక్కడే పునః ప్రతిష్టా చేస్తాము అని తెలియజేశారు . ఈ కార్యక్రమం లో కూనవరం, ఎంపీటీసీ గుడిపూడి కోటేశ్వరరావు
టిబిజికెఎస్ బ్రాంచి ఉపాధ్యక్షులు వూకంటి ప్రభాకర్ రావు టిఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు .

Statue of Telangana ideologue Jayashankar destroyed.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube