చెరువులో కరెంటుతో దొంగతనంగా చేపల వేట

ప్రాణ భయంతో మత్స్యకారులు

1
TMedia (Telugu News) :

చెరువులో కరెంటుతో దొంగతనంగా చేపల వేట

– ప్రాణ భయంతో మత్స్యకారులు

టీ మీడియా, నవంబర్ 12, తిరుమలాయపాలెం : తిరుమలాయపాలెం మండలం లోని ముజాయితీపురం గ్రామం శుద్ధ వాగు తండా ప్రక్కన ఉన్న చేపల చెరువులో దొంగతనంగా కరెంటు సహాయంతో చేపలు పడుతుండగా మత్స్యకారులు గుర్తించి పట్టుకున్న సంఘటన చోటు చేసుకుంది మత్స్యకారులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని సుద్ధవాగు తండా ముజాయితీపురం గ్రామంలో మత్స్యకారుల సొసైటీ కి సంబంధించిన పెరికల చెరువులో శుద్ధ వాగు తండా కు చెందిన కొంతమంది వ్యక్తులు పలుమార్లు దొంగతనంగా చేపలు పడుతూ దొరికినప్పటికీ మత్స్యకారులు పెడద్ద మనుషుల సమక్షంలో పంచాయతీలు నిర్వహించి వదిలేశారు అంతటితో ఆగకుండా మళ్లీ అదే గ్రామానికి చెందిన బానోత్ కళ్యాణ్ అనే వ్యక్తి వ్యవసాయ భావుల మోటార్లకు సంబంధించిన కరెంటు సహాయంతో చెరువులో తీగలతో చేపలను దొంగతనంగా పడుతుండగా ముజాయితీపురం గ్రామ మత్స్యకారులు పట్టుకొని ప్రశ్నించగా వారి నుండి విడిపించుకుని పారిపోయారు.

Also read : తెలంగాణలో కమల వికాసం స్పష్టంగా కనిపిస్తోంది

ఈ క్రమంలో మత్స్యకారులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.మత్స్యకారులు రాత్రి సమయాల్లో చేపల చెరువు కాపలాకు వెళ్లాలంటే కరెంటు తీగలు ఉంటాయి అని ప్రాణభయంతో ఉంటున్నారు ఇప్పటికైనా పోలీసు అధికారులు వారిపై చర్య తీసుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube