స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గలేదు..
-క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం..
టీ మీడియా, ఏప్రిల్ 14ఢిల్లీ:విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర మరోసారి స్పష్టత ఇచ్చింది. డిజిన్విస్టిమెంట్ ప్రక్రియలో నిలిచిపోలేదని స్పష్టం చేసింది. గడిచిన రెండు రోజులుగా మీడియాలో వస్తున్న వార్తలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఉక్కు శాఖ ప్రకటన జారీ చేసింది. ఆర్ఐఎన్ఎల్ పెట్టుబడుల మీడియా నివేదికల్లో నిజం లేదని.. పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ పురోగతిలో ఉందని ప్రకటించింది ఉక్కుశాఖ. ఆర్ఐఎన్ఎల్ పనితీరును మెరుగుపరచడానికి మాత్రమే మద్దతు ఇస్తున్నామని.. త్వరలో ప్రైవేటీకరణ పూర్తి అవుతుందని తెలిపింది. కేంద్ర ఉక్కుశాఖ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే విశాఖ వచ్చి తాత్కాలికంగా పెట్టుబడులు ఉపసంహరణ ఆగినట్టు ప్రకటించారు. దీనిపై అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ, వైసీపీ ఎవరిరి వారు తమ ఘనతగా చాటుకుంటూ ప్రకటనల చేశారు. మాటలయుద్ధానికి కూడా దిగారు. ఇప్పటికీ విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద బీఆర్ఎస్- బీజేపీ మధ్య వార్ నడుస్తోంది
AlsoRead:చెరువులో పడి ముగ్గురు పిల్లల దుర్మరణం..
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube