స్థలాలు గుంజుకోవడం అన్యాయం

స్థలాలు గుంజుకోవడం అన్యాయం

1
TMedia (Telugu News) :

స్థలాలు గుంజుకోవడం అన్యాయం

టీ మీడియా, జూన్ 11, వనపర్తి బ్యూరో : ఊళ్లలో స్టేడియాలు మంచివే కాని ఉండడానికి ఇచ్చిన స్థలాలు గుంజుకోవడం అన్యాయమ వనపర్తి మండలం పెద్ద గూడెం గ్రామంలో నిర్మించే స్టేడియం కొరకు 1996 లో స్థలాలు ఇచ్చినా పట్టాలు మరచిన ప్రభుత్వంతో పోరాడి 2000 ల సంవత్సరములో 62 మంది లబ్దిదారులు పట్టాలు సాధించారు, కాని ఆర్థిక పరిస్థితులు సరిగా లేక జీవనోపాధి లేక వలస కూలీలుగా పోయి ఇండ్లు కట్టుకోలేక పోయారు. నిజముగా దళితుల అభివృద్ధికి చిత్తశుద్ధితో తెరాస ప్రభుత్వం ఉంటే అ లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ స్కీమ్ వర్తింప చేసి ఇండ్లు కట్టియాలి, కాని చేయక పోగా దళిత వ్యతిరేక తెరాస ప్రభుత్వం ఈ మద్య నిర్ణయం తీసుకొని నిర్మిస్తున్న స్టేడియం కొరకు దళితులకు ఇచ్చిన స్థలాలు వద్దని స్వయంగా యువత చెప్పి మాకు ఇందిరమ్మ కాలని దగ్గర ఉన్న 720 మరియు 721 సర్వం నంబర్ ల లో గల 4 ఎకరాల ల లో ఉన్న స్థలంలో స్టేడియం నిర్మించాలనే కోరికను తుంగలో తొక్కారు,ఎలాంటి సమస్య లేని స్థలము వదిలేసి దళితుల స్థలం తీసికొని వారికి నిల్వ నీడ లేకుండా చెయ్యాలన్న ఆలోచన ఎవరిది? సమర్థించిన వారెవరు? సరిచేయాల్సిన బాద్యత ఎవరిది? 10 ప్లాట్లు పోతవి వాటిని పక్కన ఇస్తాము అని చిలుక పలుకు లు పలికిన తెరాస నాయకులు ఇప్పుడు 50 ప్లాట్ల తో పాటు లే అవుట్ లో ఉన్న రోడ్డును మరియు గుట్ట ను సాఫ్ చేస్తూ ఎకరా కావలసిన దానికి దాదాపుగా రెండున్నర ఎకరాలు చదును చేస్తే మైనింగ్ డిపార్ట్మెంట్, అటవీశాఖ, మరియు పర్యావరణ శాఖ లు పత్తానే లేవు, కనీసం గ్రామ పంచాయతీ తీర్మానం, గ్రామ సభ ఆమోదం లేకుండా చేస్తున్నారంటే గ్రామంలో ఎంత నిరంకుశ పాలన నడుస్తుందో ఇట్టే అర్థం అవుతుంది, ఇక స్టేడియం కొరకు తీసుకొన్న దాదాపుగా 50 ప్లాట్ల కు బదులుగా స్థలం ఇవ్వాలన్న అక్కడ సరిపడా స్థలం లేదు, అయినా ఇస్తామని మభ్య పెడుతున్నారు, ఒక వేళ ఇవ్వాలన్న పక్కన ముస్లిం మైనారిటీ లు కబర్ స్థాన్ కొరకు ఉంచుకున్న స్థలం ఉంది మా స్థలము ముట్టు కో వద్దు అని మంత్రి గారి కి మెమొరాండం ఇచ్చుకున్నారు.మరి ఎక్కుడ ఇస్తారు, చివరికి అన్నదమ్ముల్లా కలిసి బ్రతికే దళితులకు మరియు ముస్లిం మైనారిటీల మధ్య చిచ్చు పెట్టే దిశగా పాలకుల పన్నాగం ఉన్నట్లు అర్థం అవుతుంది.

 

Also Read : రెండో విడుత సింగరేణి ఇళ్ల పట్టాల పంపిణీ

చివరగా పాలకులు చిత్తశుద్ధి ఉంటే ముందు దళితులకు ప్లాట్లు అభివృద్ధి చేసి రోడ్లు, డ్రైనేజీ, లైటింగ్ ఏర్పాటు చేసి 56 ఎకరాలు ఉన్న ఆ గుట్ట స్థలము లో బీసీ సోదరులు కట్టుకున్న నిర్మాణాలకు కూడా గ్రామ పంచాయతీ గుర్తింపు ఇచ్చి భవిష్యత్తులో గుట్ట ప్రాంతం అన్యక్రాంతం కాకుండా చూడాలని ,ఆతరువాత స్టేడియం పని మొదలెట్టాలి, సర్వే నెంబర్లు 720 మరియు 721 లో ఉన్న 4 ఎకరాల భూమిని భవిష్యత్తులో కబ్జాలకు గురి కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని వనపర్తి జిల్లా బహుజన సమాజ్ పార్టీ అద్యక్షులు నాగనమోని చెన్నరాములు ముదిరాజ్ డిమాండ్ చేశారు. లబ్ధిదారులతో జరిగిన సమావేశంలో బహుజన సమాజ్ పార్టీ జిల్లా ఉపాద్యక్షులు చిరంజీవి,జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ గడ్డం మహేష్, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ బహుజన రమేష్, జిల్లా బివిఎఫ్ కన్వీనర్ గౌరగల్ల రమేష్, వనపర్తి మండలం కన్వీనర్ దండు రాజు, సోషల్ మీడియా కన్వీనర్ శ్రీ కాంత్ పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube