దేవస్థానం అధికారుల వింత ధోరణి
ఆలయ ఆవరణ లోకి ప్రవేశించ వద్దని నిషేధాజ్ఞలు
టీ మీడియా, జూలై 23, మహానంది:
దేవస్థానం అధికారులవింత ధోరణి ఆలయ ఆవరణలో కి భక్తులు మరియు గ్రామస్తులు ప్రవేశించ రాదని ఆలయ ముఖ ద్వారం వద్ద నోటీసు అంటించడం చర్చనీయాంశంగా మారింది. మహానంది మండలం బొల్లవరం గ్రామం లో ఉన్నటువంటి ఈశ్వర మరియు ఆంజనేయ స్వామి ఆలయంలోకి వెళ్లవద్దని కారణం ఆలయంలోనికి వెళ్లే విద్యుత్తు వైరు సరిగా లేకపోవడంతో ఈ ఆంక్షలు విధించారు .లక్షల రూపాయల ఆదాయం వస్తున్నా దాదాపు 30 మీటర్ల వేయరు విద్యుత్ స్తంభం నుండి ఆలయంలోనికి ఏర్పాటు చేయకుండా గత రెండు రోజుల క్రితం నోటీసు అంటించడం వివాదస్పదంగా మారింది
Also Read : హైకోర్టును కర్నూల్ కి తరలింపు
.దేవాదాయ అధికారులవింత ధోరణితో భక్తులు విస్తుపోతున్నారు.
విద్యుత్ వైర్ మార్చడానికి ఎన్ని రోజులు పడుకుంది అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
అధికారులు వెంటనే స్పందించి తమ చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
ఇందులో పంచాయతీ అధికారులను కూడా భాగస్వామ్యం చేయడం వివాదాస్పదంగా మారింది.