వీధి కుక్కల స్వైర విహారం

0
TMedia (Telugu News) :

బెంబేలెత్తిపోతున్న వాహన దారులు

టీ మీడియా, డిసెంబర్ 22, మహానంది:

మహానంది మండలం గాజులపల్లి మెట్ట మీద వీధి కుక్కలు స్వైర విహారంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గాజులపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఏ రోడ్డులో చూసిన కుక్కలు గుంపులు గుంపులుగా దర్శనమిస్తున్నాయి. రాత్రిపూట ద్విచక్ర వాహనదారుల వెంటపడి మరీ ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. రాత్రి సమయాలలో వీటి ఆగడాలకు హద్దు, ఆదుపు లేకుండా పోతున్నాయన్నారు. అత్యవసర పనులపై బయటకు రావాలంటే భయాందోళనకు గురి కావలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నా వాహన చోదకులు. సంబంధిత అధికారులు స్పందించి కుక్కల బెడద లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube