హైదరాబాద్‌లో మరింత కఠినంగా ట్రాఫిక్‌ రూల్స్‌

హైదరాబాద్‌లో మరింత కఠినంగా ట్రాఫిక్‌ రూల్స్‌

1
TMedia (Telugu News) :

హైదరాబాద్‌లో మరింత కఠినంగా ట్రాఫిక్‌ రూల్స్‌..

టీ మీడియా ,నవంబర్ 28,హైదరాబాద్‌ : హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ రూల్స్‌ను మరింత కఠినంగా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా నేటి నుంచి స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్‌ నియమాలను ఉల్లంఘిస్తే భారీ ఫైన్లు తప్పవని హెచ్చరించారు. రాంగ్‌సైడ్‌ డ్రైవింగ్‌, ట్రిపుల్‌ రైడింగ్‌ చేస్తే పెద్దమొత్తం జరిమానాలు విధించనున్నారు. ఈ మధ్యకాలంలో నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదాలపై ట్రాఫిక్‌ పోలీసులు అధ్యయనం చేయగా.. ఈ రెండు ఉల్లంఘనల వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించారు. దీంతో ఉల్లంఘనలకు పాల్పడుతున్న వాహనదారులతో పాటు పాదచారులు కూడా ప్రమాదాలకు గురవుతున్నట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో గత వారం రోజులుగా ఈ ఉల్లంఘనలపై అవగాహన కల్పించిన ట్రాఫిక్‌ పోలీసులు.. సోమవారం నుంచి స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. రాంగ్‌ రూట్‌లో వచ్చే వాహనాలకు రూ.1700, ట్రిపుల్‌ రైడింగ్‌కు రూ.1200 వరకు ఫైన్‌ విధించనున్నారు. ఇక జీబ్రా లైన్‌ దాటితే రూ.100, ఫ్రీ లెఫ్ట్‌కు అడ్డుపడితే రూ.వెయ్యి జరిమానా విధించనున్నారు.

Also Read : క్వారంటైన్‌ నుంచి పెద్ద ఎన్‌క్లోజర్‌లోకి మరో రెండు చీతాలు

అయితే ద్విచక్ర వాహనాలు, ఆటోలతో ప్రమాదాలుగా తక్కువగా ఉన్న నేపథ్యంలో.. వాటిపై విధించే జరిమానాలు కూడా తక్కువగానే ఉంటాయని అధికారులు చెప్పారు. భారీ వాహనాలు రాంగ్‌రూట్‌లో రావడంతో నష్టం కూడా అదే స్థాయిలో ఉంటుందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని బైక్‌లు, ఆటోలకు విధించే జరిమానాలతో పోలిస్తే.. భారీ వాహనాలకు విధించే జరిమానాలు ఎక్కువేనని చెప్పారు. మధ్య తరగతి ప్రజలు నడిపించే వాహనాలైన బైక్‌లు, ఆటోలపై విధించే జరిమానాలు గతంతో పోలిస్తే తక్కువగానే ఉంటాయని తెలిపారు. ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడకుండా.. ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని, ప్రమాదాలు తగ్గించాలని కోరుతున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube