గ్యాస్ ధరల పెంపు పై నిరసన తెలిపిన ఐద్వా

గ్యాస్ ధరల పెంపు పై నిరసన తెలిపిన ఐద్వా

1
TMedia (Telugu News) :

గ్యాస్ ధరల పెంపు పై నిరసన తెలిపిన ఐద్వా

టీ మీడియా,మార్చి 22, గోదావరిఖని :సామాన్య మధ్యతరగతి ప్రజలపై పెను భారం మోపుతున్న కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి పై ఐద్వా రాష్ట్ర కమిటి పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లో మంగళవారం ఐద్వా ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.పెద్దపల్లి జిల్లా ఐద్వా కార్యదర్శి ఏ మహేశ్వరీ హాజరై మాట్లాడుతూ…కేంద్ర ప్రభుత్వం మధ్యతరగతి సామాన్య ప్రజలపై పెనుభారం మోపుతుందని, నిత్యావసర వస్తువులు వంట నూనెలు బ్లాక్ మార్కెట్ మాఫియాను పెంచి పోషిస్తోందని,పెట్రోల్ డీజిల్ పై రేట్లు పెంచుతూ నేడు మహిళలకు వంట సరుకైన గ్యాస్ సిలిండర్ పై 50 రూపాయలు పెంచడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఐద్వా అధ్యక్షురాలు జి లావణ్య,రమణ,ఫైముధా, భూలక్ష్మి,పీర్ మహ్మద్, నర్సయ్య తదితరులు పాల్గోన్నారు.

Also Read : సేవా సదనంలో అన్న వితరణ

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube