అఖిలపక్షం ఆధ్వర్యంలో త్వరలో నిరసన దీక్ష

అఖిలపక్షం ఆధ్వర్యంలో త్వరలో నిరసన దీక్ష

1
TMedia (Telugu News) :

అఖిలపక్షం ఆధ్వర్యంలో త్వరలో నిరసన దీక్ష

టీ మీడియా, ఏప్రిల్ 22, వనపర్తి, బ్యూరో : వనపర్తి జిల్లా కేంద్రంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో త్వరలో నిరసన దీక్షా కార్యక్రమం ఏర్పాటు చేయబోతున్నాం అని అఖిలపక్ష నాయకులు సతీష్ యాదవ్ అన్నారు. గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా అఖిలపక్షం ఆధ్వర్యంలో పలు సమస్యలపై పోరాడుతూ వస్తున్న అఖిలపక్షం కొన్నిసందర్భాల్లో విజయం సాధించి ప్రజలకు చేరువైంది. వనపర్తిలో ఉన్న ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి అన్యకాంతం అవుతున్న ప్రభుత్వ భూముల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చి విజయం సాధించే దిశగా ప్రయత్నిస్తుంది అఖిలపక్షం అన్నారు. కానీ కొన్ని ప్రజా సమస్యలను కలెక్టర్ వ్యవసాయ శాఖ మంత్రి ఎమ్మార్వో చేసి మున్సిపల్ కమిషనర్లకు చైర్మన్లకు పలు సందర్భాల్లో వినతిపత్రం ఇస్తూ మేము చేసే పోరాటాన్ని నేను చెప్పే సమస్యలను పరిష్కరించాలని కోరాము. కానీ కొన్ని సమస్యలను పక్కదారి పట్టించే వాటిని నెరవేర్చకుండా ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ వస్తున్న అధికారపక్షాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను మేము మా ఇండ్ల కోసం మా సొంత లాభం కోసం కానీ ఒక సమస్య కూడా ఈ రోజు వరకు ప్రశ్నించలేదు ప్రజల సమస్యలపై మాత్రమే పోరాటం చేస్తున్నాం మా పోరాటంలో మీ దృష్టికి పలు సమస్యలను తీసుకు వస్తున్నాను కానీ మీరు వాటిని పెడచెవిన పెడితే ఎవరికి నష్టం ప్రజలకే కదా సరే అలా అంటే ఇప్పుడు మీరైనా ప్రజా సమస్యలు తీర్చండి లేదా మీరు మర్చిపోతే మేము అఖిలపక్షంగా మీ ముందుకు సమస్యలు తీసుకువస్తున్నాం వాటిని వెంటనే పరిష్కరించండి ప్రజల ఓట్లతో గెలిచి వారికి మంచి చేసే ఆలోచన మీకు ఉంటే వెంటనే ఈ కింది అంశాలను పరిగణనలోకి తీసుకొని పరిష్కరించాలని ప్రజలకు దగ్గర కావాలని అఖిలపక్షం తరఫున కోరారు.

Also Read : కిషన్‌రెడ్డిపై నిప్పులు చెరిగిన మంత్రి గంగుల కమలాకర్

1.పాత బస్టాండ్ వినియోగంలోకి వెంటనే తేవాలి అక్కడ ప్రజల నిరీక్షణ ఇబ్బందులు తొలగించాలి.2. అర్టిసి బస్టాండ్ బస్ డిపో వనపర్తిలో బస్సుల సంఖ్యను పెంచాలి ,ఎక్స్ప్రెస్, సూపర్ డీలక్స్, రాజధాని ఎక్స్ప్రెస్ ను వెంటనే తెప్పించాలి. గత చరిత్ర కలిగిన వనపర్తి బస్ డిపో మెరుగుపరచాలి, వాపస్ పంపిన బస్సులను అన్నిటిని వెనక్కి రప్పించాలి. 3.రాజీవ్ చౌక్ లోని విద్యాభవన్ను కమర్షియల్ గా కాకుండా మహాత్మ జ్యోతిరావు పూలే, సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంగా మార్చాలి. 4.వనపర్తికి గుండెకాయ లాంటి పాలిటెక్నిక్ భవనాన్ని శిధిలావస్థలో ఉంది దాన్ని మరమ్మతులు చేయించి హద్దులు ఏర్పాటు చేసి రక్షించాలి. 5.రోడ్డు వెడల్పు పనులు నిదానంగా చేయడం వలన ఇండ్లలో షాపులలో మనుషుల కళ్ళ లో మొత్తానికి మొత్తం దుమ్ము ధూళితో వెళ్లి పోతుంది కనుక వెంటనే స్పందించి తెచ్చి రోడ్డు వెడల్పు పూర్తి చేయాలి 6.దళితవాడ నుంచి కశీంనగర్ రోడ్ లోని మెయిన్ రోడ్డు పైన ఉన్న నువ్వుల బండ స్థలాన్ని అన్యాక్రాంతం కాకుండా చిల్డ్రన్స్ పార్క్ వెంటనే నిర్మించాలని అఖిలపక్షం డిమాండ్ చేస్తుంది. ఇవే కాకుండా పలు సమస్యలు పరిష్కరించాలని అఖిలపక్షం తరఫున దీక్షా త్వరలో చేస్తుందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్, బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు చిరంజీవి, సిపిఐ కార్యదర్శి రమేష్, వైయస్సార్ టిపి కార్యవర్గ సభ్యులు వెంకటేష్, ఎస్పి జిల్లా అధ్యక్షులు జయరాములు, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube