మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా

మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా

1
TMedia (Telugu News) :

మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా

 

టీ మీడియా, అక్టోబర్ 28, మధిర:మధిర ఎంఈఓ ఆఫీస్ ఎదురుగా శుక్రవారం 40మంది మధ్యహ్నం భోజన కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….
మధ్యాహ్న భోజన కార్మికులతోని వెట్టి చాకిరి చేయించుకుంటున్న ప్రభుత్వం, కనీస ఫిక్స్డ్ వేతనం ఇవ్వకుండా,ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం ఉండటం వల్లనే డ్రాప్ అవుట్ తగ్గుతుందని రిపోర్టులు వస్తున్న ప్రభుత్వం ఈ మధ్యాహ్న భోజనాన్ని ప్రోత్సహించకుండా, ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పజెప్పాలని చూస్తుందని, దీన్ని మధ్యాహ్న భోజనం కార్మికుల సంఘం సిఐటియు వ్యతిరేకిస్తున్నామని, కనీస వేతనం ఇవ్వాలని డ్రెస్ కోడ్ అమలు చేయాలని, వంట పాత్రలు, మరుగుదొడ్లు,మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.

Also Read : కరెంట్‌ షాక్‌తో ముగ్గురు రైతులు మృతి

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ రమ, జిల్లా ప్రధాన కార్యదర్శికళ్యాణపు.వెంకటేశ్వరరావు, అధ్యక్షుడు తుమ్మ విష్ణువర్ధన్, సహాయ కార్యదర్శి శీలం నరసింహారావు, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ రమ్య, మండల బాధ్యులు పడకంటి మురళి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు తేలప్రోలు రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube