పాత పెంక్షన్ విధానం కొనసాగించాలి

కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా

1
TMedia (Telugu News) :

పాత పెంక్షన్ విధానం కొనసాగించాలి

– కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా

టీ మీడియా,నవంబర్ 3, ఖమ్మం : పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి కోరుతూ ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షర్స్ ఫెడరేషన్ పిలుపు మేరకు తెలంగాణ ఆల్ పెన్షనర్స్&రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా కమిటి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు 100 మంది తో పెద్ద ఎత్తున ధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మచ్చా రంగయ్య మాట్లాడుతూ CPS రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని,కనీస పెన్షన్ రూ. 12000 చెల్లించాలని,3 D.R లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్ల సమస్యలను జాప్యం చేస్తుందని నెల మొదటి తేదీన పెన్షన్ చెల్లించాలని,PRC పెండింగు జ.ఓ.లను విడుదల చేయాలన్నారు.

Also Read : వైకుంఠ దామాన్ని ఏర్పాటు చేయాలి

భవిష్యత్తులో పోరాటాలకు కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. అనంతరం ర్యాలీ నిర్వహించి, కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించనైనది.ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు గోపీచంద్,కల్యాణం నాగేశ్వరరావు,మల్లికార్జునరావు,ఝాన్సీ,బందు వెంకటేశ్వరరావు,మాధవరావు,వీరబాబు,టి.యన్. రావు,జనార్ధన్ స్వామి,రాజేంద్రప్రసాద్,రవికుమార్,మధుసూదనరావు,కృష్ణారావు,యేశోబు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube