పెంచిన విద్యుత్ చార్జీలపై నిరసన
టీ మీడియా, ఏప్రిల్ 5 ,అంబాజీపేట:పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో సోమవారం తాసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. లాంతరులు, విసనకర్రలు, దీపం బుడ్డులు పెట్టి వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు శిరిగినీడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 30 యూనిట్లుకి కూడా స్లాబ్ పెట్టారంటే పేదల పైన బాదుడే బాదుడు… నూతన పథకం అమలు చేస్తున్నట్లుగా ఉందని విమర్శించారు. మండల జనసేన పార్టీ అధ్యక్షుడు దొమ్మేటి సాయి కృష్ణ మాట్లాడుతూ వెైసిపీ ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంపుపై నిర్ణయం తీసుకోవడం ములిగే నక్కపై తాటి పండు పడినట్లు అయిందని, అసలే నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్ డీజిల్, గ్యాస్ ధరలు పెంచడంతో ప్రజలు తీవ్రమైన ఆర్ధిక భారం పడడమే కాకుండా తీవ్రమైన ఇబ్బందులకు గురవుతుండగా మరల విద్యుత్ చార్జీలు పెంచడంతో ప్రజలకు పెనుభారంగా మారిందన్నారు. ఎన్నికల ముందు ప్రచార సభల్లో జగన్ మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం ఏర్పడితే విద్యుత్ చార్జీలు పెంచబోమని, పీపీఏ లు రద్దు చేస్తే ఏపీలో పవర్ చార్జీలు తగ్గుతాయిని మాయమాటలతో ప్రజలను మోసం చేశారని, నేడు జగన్ రెడ్డి మాట తప్పి మడమ తిప్పి విద్యుత్ చార్జీలు పెంచారని విమర్శించారు. అనంతరం వినతి పత్రాన్ని తాసిల్దార్ కార్యాలయంలో సమర్పించారు. ఈ కార్యక్రమంలో సుంకర పేరయ్య నాయుడు, ఎంపీటీసీ వాకపల్లి దొరబాబు, కొర్లపాటి వెంకటేశ్వరరావు ( ఢిల్లీ ) జనసేన నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.
Also Read : ఇంధన ధరలు 30 శాతం తగ్గించొచ్చు : మంత్రి కేటీఆర్
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube