టీ మీడియా, డిసెంబర్ 30, జగిత్యాల:
సిఐటియు జగిత్యాల జిల్లా కార్యదర్శి తిరుపతి నాయక్ మాట్లాడుతూ
సహకరించండి వేతనాలు పెంచేలా కృషిచేయండి అని తెలుపుతూ
ప్రభుత్వ ఆసుపత్రుల్లోని కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి జనవరి 5 నుంచి సమ్మెకు పోతున్నామని సహకరించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి తిరుపతి నాయక్ కోరారు బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోని కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికుల సమస్యల పరిష్కారానికై తలపెట్టిన సమ్మె లో భాగంగా ఈ నెల 5 నుంచి తలపెట్టిన సమ్మె నోటీస్ ను ఏరియా ఆసుపత్రి సూపరెండేంట్ కు నోటీసు అందించారు అనంతరం జగిత్యాల ప్రెస్ క్లబ్ లో ప్రకటన విడుదల చేశారు.
ఈ సందర్భంగా తిరుపతి నాయక్ మాట్లాడుతూ ఏడూ ఏండ్లుగా ప్రభుత్వం కార్మికుల సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు అందుకే ఈ నెల 5 నుంచి సమ్మెకు పోవడం జరుగుతోందని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోందన్నారు ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న పేషంట్ కేర్ శానిటేషన్ సేక్కురిటీ గార్డ్ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు జిఓ నెం 68 60 లలో ఎదో ఒకటి అమలు చేయాలని కోరారు పీఎఫ్ కాంట్రాక్ట్ సంస్థలు చేస్తున్న అక్రమాలను అరికట్టాలని కోరారు పిఎఫ్ జమలలో కార్మిక యజమానులు సక్రమంగా జమ చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు థర్డ్ పార్టీ కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేసి మ్యాన్ పవర్ నిర్వహణను ఆసుపత్రి అధికారులకు అప్పగించాలని తిరుపతి నాయక్ కోరారు ఏడాదికి 25 క్యాజువల్ లీవ్స్ అమలు చేయాలని సిబ్బందికి ప్రతిరోజు సరిపడా శానిటైజర్స్ మాస్కులు పిపిఈ కీట్లు కరోనా ఇంటెన్సివ్స్ ఇవ్వాలని సిఐటియు జిల్లా కార్యదర్శి తిరుపతి నాయక్ డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో శాని టైజర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు నరేందర్ ఔట్ సోర్సింగ్ కార్మికులు విక్రమ్ సురేష్ లక్ష్మీ తదితరులు పాలుగోన్నట్టు కమిటీ సభ్యులు తెలిపారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube