సమ్మె నోటీసు ఇచ్చిన ఫీల్డ్ అసిస్టెంట్ లు

సమ్మె నోటీసు ఇచ్చిన ఫీల్డ్ అసిస్టెంట్ లు

1
TMedia (Telugu News) :

సమ్మె నోటీసు ఇచ్చిన ఫీల్డ్ అసిస్టెంట్ లు

టి మీడియా, మార్చి 16,చింతూరు:
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక విధానాలు ఉపాధి హామీ పథకానికి బడ్జెట్లో నిధులు తగ్గించడం, రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఫీల్డ్ అసిస్టెంట్ను ఉద్యోగ భద్రత జీతాలు పెంపు లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం తదితర అంశాలను వివరిస్తూ మార్చి 28, 29 తేదీల్లో దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో పాల్గొంటామని సిఐటియు ఆధ్వర్యంలో ఎంపీడీవో వెంకరత్నం కు బుధవారం ఫీల్డ్ అసిస్టెంట్ సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. అనంతరం జరిగిన సమావేశంలో ఫీల్డ్ అసిస్టెంట్ సిఐటియు నాయకులు వెంకట నరసయ్య కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడుస్తోందని అన్నారు ఈ బడ్జెట్ సమావేశాల్లో లక్షా యాభై వేల కోట్లు కేటాయించాల్సి ఉన్న 75 వేల కోట్లు మాత్రమే కేటాయించడం దుర్మార్గమన్నారు. కార్మిక చట్టాలను కాలరాస్తూ మరోపక్క పథకాలకు భారీగా నిధులు పెడుతున్నారని విమర్శించారు.

Also Read : కార్బోవాక్సిన్ (కోవిడ్ వాక్సిన్) మొదలు

రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్స్ ఉద్యోగ భద్రత కల్పించకుండా ఏడు సంవత్సరాలుగా జీతాలు పెంచకుండా వారితో వెట్టి చాకిరి చేయించుకుంటున్న ని విమర్శించారు కాబట్టి ఉపాధి హామీ కూలీలకు 200 రోజులు రోజుకు ఆరు వందల రూపాయలు ఇవ్వాలని ఫీల్డ్ అసిస్టెంట్ తో సంబంధం లేకుండా 20 వేల వేతనం ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని లేబర్ కోర్టు రద్దు చేయాలని నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని ప్రభుత్వ సంస్థలను పరిరక్షించాలని జరిగే మార్చి 28 29 సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు సురేష్ ఫీల్డ్ అసిస్టెంట్లు అప్పారావు, సత్తిబాబు, సూరమ్మ, దే సయ్య, గంగరాజు, శ్రీపతి నాగేశ్వరరావు, నాగరాజు, పొ ద్దయ్య తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube