సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి

సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి

1
TMedia (Telugu News) :

సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి

టీ మీడియా,మార్చి 15,కరకగూడెం:మార్చి 28, 29 తేదీల్లో జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీపీఎం మండల కార్యదర్శి,సి ఐ టి యు నాయ‌కులు కొమరం కాంతారావు అన్నారుమధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం(సిఐటియు అనుబంధం) ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో సమ్మెకు సంబంధించిన సమ్మె నోటీసు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలుగా నిర్ణయించి, తక్షణమే అమలు చేయాలని‌‌ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కరోనా నేపథ్యంతో పాఠశాలలు బంద్ ఉన్న కాలానికి మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు చెల్లించాలని, గుడ్లకు అదనంగా బడ్జెట్ కేటాయించాలని అలాగే అవసరమైన వంట గ్యాస్ సబ్సిడీ ఇవ్వాలని వంట షెడ్లు వంట పాత్రలు తదితర మౌలిక వసతులు కల్పించాలని కోరారు.మధ్యాహ్న భోజన నిర్వహణను స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చేనిర్ణయాన్నిఉపసంహరించుకోవాలని గుర్తింపు కార్డులు ప్రభుత్వమే ఇవ్వాలి, ప్రభుత్వ బీమా పీఎఫ్ ఈఎస్ఐఇలాంటి సౌకర్యం కల్పించాలన్నారు.ఈ కార్యక్రమంలో గొగ్గలి సావిత్రి, అంకమ్మ పూనెం సాయమ్మ, గొగ్గలి భద్ర, పులి లలిత తదితరులు పాల్గొన్నారు.

Also Read : విద్యార్థులే ఉపాధ్యాయులైన వేల

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube