కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడీని అరికట్టాలి: వివైఎస్ఎస్

0
TMedia (Telugu News) :

టీ మీడియా,నవంబర్,21, భద్రాచలం

భద్రాచలం విద్యార్థి యువజన సంఘాల సమితి (వివైఎస్ఎస్) ముఖ్య కార్యకర్తల సమావేశం ఆదివారం స్థానిక వివైఎస్ఎస్ కార్యాలయంలో వివైఎస్ఎస్ పట్టణ బాధ్యులు క్రాంతి అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా వివైఎస్ఎస్ వ్యవస్థాపకులు గుమ్మడి రాజు మాట్లాడుతూ డిగ్రీ అడ్మిషన్లు గడువు ముగుస్తున్న నేపథ్యంలో జిల్లా,భద్రాచలం వ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ డిగ్రీ విద్యాసంస్థలు విద్యార్థుల నివాసాలకు వెళ్లి ఒక్కోఅడ్మిషన్ కు డబ్బు ఆశ చూపించి విద్యార్థుల బయోడేటా,వాళ్ల ఫోన్ నెంబర్లను యాజమాన్యాలు దగ్గర పెట్టుకుని ఆన్లైన్ అడ్మిషన్లు చేసి విద్యార్థులను తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.

మరోపక్క అడ్మిషన్లను క్యాన్సిల్ చేయాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులను తీసుకెళ్లి కళాశాలల యాజమాన్యాలను అడుగుతుంటే వారు వాళ్లని డబ్బులు కట్టాలి లేదంటే మేము క్యాన్సిల్ చేయ్యం ఎవరికీ చెప్పుకుంటారొ చెప్పుకోండి అని బెదిరిస్తూ చాలా ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. తక్షణమే ఉన్నత విద్యాశాఖ అధికారులు స్పందించి అడ్మిషన్ల పేరిట దోపిడీలకు పాల్పడుతున్న కళాశాలలపై చర్యలు తీసుకోవాలని డిగ్రీ దోస్త్ ఆన్లైన్ అడ్మిషన్ల తేదీని పొడిగించాలని.ఈ కార్యక్రమంలో వివైఎస్ఎస్ నాయకులు శివ, రమణ,అంజలి,విష్ణు,ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Bhadrachalam Student Youth Union (VYSS) chief functionaries meeting was presided over by VYSS town officials
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube