విద్యార్థులు ఎవరు తొందరపాటు చర్యలకు పాల్పడవద్ద:సబిత ఇంద్రారెడ్డి
టీ మీడియా, మే 30, హైదరాబాద్: తక్కువ మార్కులు వచ్చాయని ఒకరు, ఫెయిల్ అయ్యానని మరొకరు.. ఇలా పలువురు ఇంటర్ విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఆత్మహత్యలపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. ఇంటర్లో ఉత్తీర్ణత సాధించలేదని విద్యార్థులెవరూ తొందరపాటు చర్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు.
Also Read : ఇంటర్ టాపర్లకు సన్మానం
ఉత్తీర్ణత సాధించని విద్యార్థులు ఏడాది నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తోందని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. విద్యార్థులకు తల్లిదండ్రులు మానసిక ధైర్యం ఇవ్వాలన్నారు. లెక్చరర్లు కూడా వారికి ఆత్మస్థైర్యం కల్పించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube