విద్యార్థులకు సన్మానం

విద్యార్థులకు సన్మానం

1
TMedia (Telugu News) :

విద్యార్థులకు సన్మానం

టీ మీడియా, మార్చి 20, వనపర్తి: జిల్లా కేంద్రంలోని సాయి నగర్ కాలనీలో ఉపాధ్యాయుడు రాచాల సురేందర్రెడ్డి నళిని దంపతుల కుమారుడు మనీష్ రెడ్డి గేట్లో ఆలిండియా 54 ర్యాంక్ ఎలక్ట్రానిక్స్ లో సంపాదించిన సందర్భంగా అదేవిధంగా వెంగళరావు కాలనీకి సంబంధించిన సక్రు నాథ్ నాయక్ లావణ్య దంపతుల కూతురు తన్మై కరీంనగర్లోని ప్రతిమ మెడికల్ కాలేజీలో మెడిసిన్ సీటు సంపాదించిన సందర్భంగా వారి ఇళ్లకు వెళ్లి విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్ ప్రసాద్, శ్రీనివాస్ గౌడ్, సతీష్ యాదవ్, పెద్దలు శేఖర్ రెడ్డి, వెంకట్ రాంరెడ్డి, వెంకట రెడ్డి, శర్మ తదితరులు ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రుల సన్మానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నప్పటి నుండి మా కాలనీ లో ఉంటూ పెద్ద చదువులకు వెళుతున్న విద్యార్థులను చూస్తుంటే గర్వంగా ఉందని వారి తల్లిదండ్రుల కష్టం ఫలించిందని భవిష్యత్తులో మిమ్మల్ని చూసి విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలని వారు ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

Also Read : రాబోయే రోజుల్లో బీజేపీదే అధికారం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube